వంటలో కారం ఎక్కువైతే ఏం చేయాలి?
కూరల్లో కారం ఎక్కువైతే చాలా మంది కంగారు పడిపోతుంటారు. ఏం చేయాలో కూడా తెలియదు. ఇలాంటప్పుడు మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కారం తగ్గాలంటే దాంట్లో కొంచెం ఉప్పు, చింతపండు రసం వేసి మరిగించండి. వీటి వల్ల కారం కొంచెం తగ్గుతుంది.
చాలా సార్లు సాంబార్ కూడా మరీ కారంగా అవుతుంటుంది. సాంబార్ లో కారాన్ని తగ్గించడం చాలా సింపుల్. ఇందుకోసం కొంచెం పెసర పప్పును ఉడికించి సాంబార్ లో కలపండి. లేదా మీరు సాంబార్ లో వేసిన కూరగాయలను మరిన్ని కట్ చేసి వేయించి అందులో కొంచెం సాబార్ వేసి మరిగించి మిగతా సాంబార్ లో కలిపితే సరిపోతుంది. అయితే సాంబార్ లో ఉప్పు తక్కువగా ఉన్నా కూడా కారంగా అనిపిస్తుంది. కాబట్టి సాంబార్ లో ఉప్పును సరిపడా వేయండి.