ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఎంత ఇంటి నుంచి పనిచేసినా.. ఆఫీస్ వాతావరణంలా ఉండదు. ఇంట్లో ఉన్నాం అంటే చాలు చాలా మందికి ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈవెనింగ్ టైమ్ లో స్నాక్స్ తింటే.. ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఆఫీస్ వర్క్ టైమ్ లో స్నాక్స్ చేసుకోవడం అంటే కాస్త ఇబ్బందే. అలా అని రోజూ టీ, బిస్కెట్స్ తో సరిపెట్టుకోలేం కదా. అంటే.. చాలా త్వరగా నిమిషాల్లో తయారు చేసుకోగలిగే.. ఈవెనింగ్స్ స్నాక్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
1.పెరీ పెరీ కందా బజియా..కావాల్సిన పదార్థాలు.. 100 గ్రాముల ఉల్లిపాయరుచికి తగినంత ఉప్పు12 స్పూన్ దనియాల పొడి14 స్పూన్ పసుపు పొడి14 స్పూన్ జీరా పౌడర్12 స్పూన్ ఎర్ర కారం2 తరిగిన పచ్చిమిర్చి1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర50 గ్రాముల శెనగపిండి1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్వేయించడానికి నూనె
తయారీ విధానం.. ఉల్లిపాయలు ముక్కలు చేసి, ఉప్పు చల్లి 10-15 నిమిషాలు పక్కన ఉంచండి. శెనగ పిండి, కార్న్‌ఫ్లోర్ మినహా అన్ని పదార్థాలను జోడించి.. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ శెనగపిండి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఉప్పు కలిపి ఉంచిన ఉల్లి ముక్కలను కూడా చేర్చాలి. ఉల్లి ముక్కల్లో ఉప్పు కలపడం వల్ల కొద్దిగా నీరు వస్తుంది. ఆ నీటితోనే ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని కడాయిలో నూనె ఉంచి.. వాటిలో ఎర్రగా వేయించాలి. అంటే.. నోరూరించే పెరి పెరీ కందా బుజియా రెడీ.. దీనిని టమాటా సాస్, గ్రీన్ సాస్ తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చివరగా.. దీనిపై పెరి పెరీ పౌడర్ చల్లడం మాత్రం మర్చిపోవద్దు.
చీజీ చిల్లీ కార్నో టోస్ట్..కావాల్సిన పదార్థాలు...గార్లిక్ బ్రెడ్, 25 గ్రాముల బటర్, 100 గ్రాములు తురిమిన చీజ్50 గ్రాముల చీజ్ స్ప్రెడ్2 తరిగిన పచ్చిమిర్చి1 టేబుల్ స్పూన్ కొత్తిమీర50 గ్రాముల ఉడికించిన మొక్కజొన్న50 గ్రాములు తరిగిన ఉల్లిపాయలురుచికి ఉప్పు14 స్పూన్ పిండిచేసిన నల్ల మిరియాలు
తయారీ విధానం.. గార్లిక్ బ్రెడ్ తీసుకొని.. దాని బటర్ రాయాలి. ఆ తర్వాత.. ఒక గిన్నెలో టాపింగ్ కి కావాల్సిన అన్ని పదార్థాలను వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత బ్రెడ్ పై చీజ్ స్ప్రైడ్ చేసి ఆ తర్వా దానిపై టాపింగ్ కి ఉంచిన పదార్థాలు వేయాలి. తర్వాత ఓ వెన్ లో 10 నిమిషాలు ఉంచితే.. చీజ్ చిల్లీ కార్నో టోస్ట్ రెడీ.. పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు