భోజనం మానేయడం..
భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారని చాలా మందికి తెలుసు. లావుగా ఉన్నారనే కారణంతో భోజనం మానేయడం మంచిది కాదు. ఈ తప్పు ఎప్పుడూ చేయవద్దు. ఆహార వినియోగం చాలా ముఖ్యం, ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ , కొవ్వు వంటి అంశాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. భోజనం మానేస్తే చిన్నగా ఉండరు, ఆరోగ్యం పాడవుతుంది. ఇలా భోజనం మానేస్తే బరువు తగ్గదు. మరికొందరు హడావుడిగా తింటారు. ఇలా చేస్తే తిండి పరిమాణం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ముక్కను వీలైనంత నెమ్మదిగా తినండి. ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి.