పెరుగు వర్సెస్ మజ్జిగ : ఎండాకాలంలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?

First Published | May 11, 2023, 3:37 PM IST

పెరుగు మన గట్, శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుంది. అయితే అదే పెరుగుతో తయారు చేసే మజ్జిగలో చలువ గుణం ఉంటుంది. పెరుగు కంటే మజ్జిగనే శరీరాన్ని తొందరగా చల్లబరుస్తుందని నిపుణులు అంటున్నారు. 

Image: Getty Images

ప్రతిరోజూ పెరుగును పక్కాగా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుందని నమ్ముతారు. అయితే వేసవి తాపంలో మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి పెరుగును ఉపయోగించి తయారు చేసే మజ్జిగ మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. మజ్జిగ తేలికగా జీర్ణం కావడమే కాదు, అన్ని శరీర రకాలకు సరిపోతుంది. పెరుగు శరీరంపై వేడెక్కే ప్రభావాన్ని కలిగిస్తుందని, మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుందని నమ్ముతారు. పెరుగుకంటే మజ్జిగ మన శరీరానికి ఎందుకు ఎక్కువ మంచిదంటే..
 

మజ్జిగ వర్సెస్ పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగు తినేటప్పుడు ఇది కడుపు వేడితో సంకర్షణ చెందుతుంది. అలాగే పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను చల్లబరచడానికి బదులుగా పెంచుతుంది. అయితే మజ్జిగ తాగినప్పుడు అలా జరగదు ఎందుకంటే పెరుగులో నీళ్లు పోస్తే కిణ్వ ప్రక్రియ ఆగిపోతుంది.
 


జీర్ణక్రియకు సహాయపడుతుంది

పెరుగు, మజ్జిగ రెండూ ప్రోబయోటిక్స్. ఇవి గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగ రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యకరమైన పానీయం కూడా. ఇది విటమిన్లు, ఖనిజాల పవర్ హౌస్. ఇది తీవ్రమైన వేడిలో కూడా మన శరీర ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుతుంది. అందుకే మీ శక్తిని పునరుద్ధరించడానికి, మీ శరీరాన్ని సహజంగా చల్లబరచడానికి ఒక గ్లాసు చల్లటి మజ్జిగను తాగండి. 
 

butter milk

మజ్జిగ బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మీకు జీర్ణక్రియ సమస్యలు ఉంటే.. మజ్జిగ తీసుకోవడమే మంచిది. మీకు సరైన జీర్ణక్రియ ఉంటే.. మీరు బరువు పెరగడానికి సహాయపడటానికి మొత్తం కొవ్వు పెరుగు తీసుకోవచ్చు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటే మజ్జిగను తీసుకోండి. 

butter milk

పెరుగులో వేడి చేసే గుణం కూడా ఉంటుంది. అదే పెరుగును ఉపయోగించి తయారు చేసిన మజ్జిగ మన శరీరాల్ని చల్లగా ఉంచుతుంది. కాబట్టి వేసవిలో పెరుగుకు దూరంగా ఉండి.. దానికి బదులుగా మజ్జిగను తాగండి. 

మజ్జిగ ప్రయోజనాలు

జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే నిర్జలీకరణాన్ని ఎదుర్కోవడంతో పాటుగా మజ్జిగలో కొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. 
మసాలా ఫుడ్ ను తిన్న తర్వాత చికాకు కలిగించే గట్ పొరను ఉపశమనం చేయడానికి ఇది సహాయపడుతుంది.
భారీ భోజనంలో తీసుకున్న కొవ్వులను కరిగిస్తుంది.
ఇది కాల్షియానికి మంచి మూలం. లాక్టోస్-అసహనం ఉన్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు. 
ఇందులో విటమిన్స్ పుష్కలంగా  ఉంటాయి. 
మజ్జిగలో ఉండే పాల కొవ్వు అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచే బయోయాక్టివ్ ప్రోటీన్.
యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి. 
యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా చికాకు కలిగించే కడుపు పొరను ఉపశమనం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.  గ్యాస్ ను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.

Latest Videos

click me!