పాయా తాగితే ఏమౌతుందో ఎరుకేనా?

First Published | Feb 4, 2024, 1:06 PM IST

చలికాలంలో  లేనిపోని రోగాలు వస్తుంటాయి. ఈ సీజన్ లో మన ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో పాయాను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

bone soup

చలికాలంలో ప్రతి ఒక్కరికీ వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. తాగాలనిపిస్తుంది. అందుకే ఈ సీజన్ లో చాలా మంది టీ, కాఫీలను రోజుకు నాలుగైదు సార్లు కూడా తాగుతుంటారు. కానీ వీటిని ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీరు మాంసాహారులైతే.. ఎంచక్కా మేక ఎముకతో చేసినా పాయాను తాగండి. అవును ఇది ఈ చలికాలంలో మీకు మంచి ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది. 


పాయాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మాంసం, ఎముకలను నీటిలో ఉడకబెట్టి తయారుచేస్తారు.దీన్ని తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దీని టేస్ట్ భిన్నంగా ఉంటుంది. చలికాలంలో బయటి నుంచి మాత్రమే కాకుండా శరీరం లోపలి నుంచి కూడా వెచ్చగా ఉండటానికి మీరు ఎముకలతో తయారుచేసిన ఈ పులుసును తాగొచ్చు. మరి ఎముకతో తయారుచేసిన పాయాను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


పోషకాలు పుష్కలంగా..

చల్లిని వాతావరణంలో పాయాను తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఇది చలికాలంలో మీకు వెచ్చగా అనిపించేలా చేస్తుంది. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. పాయాను తాగితే మీ శరీరానికి.. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలు అందుతాయి. అంతేకాదు దీనిలో కొల్లాజెన్, జెలటిన్, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి మీ కీళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తాయి. 

కీళ్ల ఆరోగ్యానికి మేలు 

చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా ఎముకలు బలహీనంగా ఉన్నవారికి ఈ సీజన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి వారు పాయాను తాగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి పాయాలో ఉండే పోషకాలన్నీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీళ్ల నొప్పుల నుంచి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 

రోగనిరోధక శక్తి బలంగా.. 

చలికాలంలో సీజనల్ వ్యాధులతో  చాలా మంది బాధపడుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. కాగా ఇలాంటి సమయంలో పాయాను తాగితే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటున్నారు నిపుణులు. పాయాలో ఉండే అమైనో ఆమ్లాలు, అర్జినిన్, గ్లూటామైన్, సిస్టీన్ వంటివి మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తాయి. దీని వల్ల సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
 

 మంచి నిద్ర 

ఆరోగ్యంగా ఉండటానికి కంటినిండా నిద్రపోవాలి. పాయా కూడా మీరు ప్రశాంతంగా పడుకునేందుకు సహాయపడుతుంది. అవును పాయా మీ నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. నిజానికి  ఉడకబెట్టిన ఎముక పులుసులో ఉన్న అమైనో ఆమ్లం గ్లైసిన్ మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి వీలైతే రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి వేడి పాయాను తాగండి. ఇది మీకు  ఎక్కువ చలిగా అనిపించకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో మీరు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. 
 

గట్ ఆరోగ్యం 

పాయా గట్ ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు తాగితే జీర్ణవ్యవస్థ పొరకు మద్దతు లభిస్తుంది. ఈ విధంగా పాయా మీకు జీర్ణక్రియ, పోషక శోషణకు సహాయపడుతుంది. మీ గట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. 

Latest Videos

click me!