రేషన్ బియ్యంతో ఇడ్లీ, దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం, 1/2 కప్పు మినపప్పు, ఒక టీస్పూన్ మెంతులు. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగు గ్లాసుల రేషన్ బియ్యాన్ని పోయండి. వీటిని ఐదారు సార్లు నీళ్లతో శుభ్రంగా చేతులతో బాగా కడగిడి నీళ్లు పోసి నానబెట్టండి. అయితే దీంట్లో ఒక టీస్పూన్ ఉప్పును కూడా వేయండి. రేషన్ బియ్యంలో ఉప్పు వేసి నానబెట్టినప్పుడు ఇడ్లీ పిండికి రేషన్ బియ్యం వాసన ఉండదు. ఇందుకోసమే ఉప్పును వేయాలని చెప్తారు.