ఎవరి ఆరోగ్యం అయినా, తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వారి పెరుగుదల, అభివృద్ధి, మొత్తం శ్రేయస్సు కోసం సరైన పోషకాహారం చాలా ముఖ్యమైనది. సమతుల్య ఆహారం పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలు, విటమిన్లు , ఖనిజాలను అందిస్తుంది.