Flight Fuel: విమాన ప్రయాణం చేయాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. సామాన్యులు ప్రయాణం చేయలేరు. విమానం ధరలు ఎందుకంత ఎక్కువగా ఉంటాయో తెలుసా? దీనికి ప్రధాన కారణం విమానం ఎగిరేందుకు వాడే ఇంధనమే. ఆ ఇంధన లీటర్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
విమాన ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ టిక్కెట్ ధరలు అధికంగా ఉండడం సామాన్యులు ప్రయాణం చేయలేరు. విమాన ధరలు అంత ఎక్కువగా ఉండడం వల్ల టిక్కెట్ ధర కూడా అధికంగానే ఉంటుంది. ప్రతి విమానం టేకాఫ్ వెనుక వేల లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అవసరం పడుతుంది.
ఇతర వాహనాల్లా విమానాల్లో వాడేది పెట్రోల్ లేదా డీజిల్ కావు. అది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అనే ప్రత్యేక ఇంధనం. ఇది అత్యంత శుద్ధి చేసిన ఇంధనం. ముడి చమురు నుంచి లభించే ఉప ఉత్పత్తులలో ఇదీ ఒకటి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడితే విమాన ఇంధన ధరలు ఇంకా పెరిగిపోతాయి.
23
లీటర్ ఇంధనం ధర ఎంత?
మనదేశంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై జీఎస్టీ విధించరు. దానికి బదులుగా విలువ ఆధారిత పన్ను (VAT) విధిస్తారు. అందుకే ఈ ఇంధనం ధర నగరాన్ని బట్టి మారుతుంది. ఈ ఇంధనం ధర 1000 లీటర్లు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఈ ఇంధనాన్ని బీపీసీఎల్, హెచ్‌పీ, ఐఓసీ వంటి చమురు సంస్థలు పైపుల ద్వారా విమానయాన సంస్థలకు సరఫరా చేస్తాయి. చిన్న విమానాశ్రయాలకు ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్తారు. ఈ ఇంధనం ఎంత ప్రత్యేకమైనదంటే ఎక్కువ ఎత్తులో, తక్కువ ఉష్ణోగ్రతలో కూడా గడ్డకట్టదు. దీని డెన్సిటీ ఎక్కువ. ప్రయాణ సమయంలో అగ్ని ప్రమాదాలను కూడా ఇది నివారిస్తుంది.
33
ఎంత ఇంధనం విమానంలో వాడతారు?
మన దేశంలో బోయింగ్ 737 లేదా ఎయిర్‌బస్ ఏ320 వంటి మధ్య తరహా విమానాలు అధికంగా నడుస్తాయి. ఇది గంటకు సగటున 2500 నుంచి 3000 లీటర్ల ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. విమానం గంట ప్రయాణించిందంటే సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుంది. విమానం రెండు గంటల ప్రయాణిస్తే 5000 నుంచి 6500 లీటర్ల ఇంధనం అవసరం. ఈ రెండు గంటల ప్రయాణానికి ఇంధన ఖర్చు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు అవుతుంది. కొన్నిసార్లు అదనంగా 7000 లీటర్ల వరకు ఇంధనాన్ని రిజర్వ్‌లో ఉంచుతారు. అప్పుడు ఇంధన ఖర్చు మరింత పెరుగుతుంది. ఇంత ఖర్చును భరించాలంటే టిక్కెట్ రేట్లను అధికంగా పెట్టాలి.
ఇతర దేశాలకు ప్రయాణించే బోయింగ్ 777 లేదా ఎయిర్‌బస్ ఏ380 వంటి భారీ విమానాలకు గంటకు సగటున 10,000 నుంచి 12,000 లీటర్ల ఇంధనం అవసరం పడుతుంది. దీనికి సుమారుగా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుంది. అంటే విమానం 2 గంటలు ప్రయాణిస్తేఇంధన ఖర్చు సుమారు రూ.24 లక్షలు.