BHP Train: అది రైలు కాదు, భూకంపానికి మరో రూపం..15000 ఏనుగుల బరువుని తట్టుకోగల ఏకైక ట్రైన్ ఏదో తెలుసా ?

Published : Nov 11, 2026, 04:25 PM IST

BHP Iron Ore Train: ప్రపంచంలోనే అత్యంత పొడవైన, బరువైన ట్రైన్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ట్రైన్ బలమైన 15000 ఏనుగుల బరువుని మోసుకెళ్లగలదు. మైండ్ బ్లాక్ చేసే ఈ ట్రైన్ విశేషాలు ఇవిగో.

PREV
15
BHP Train

సాధారణంగా ట్రైన్ ని గమనిస్తే ఒక మహా శక్తి పరుగులు తీస్తున్న ఫీలింగ్ వస్తుంది. ట్రైన్ దగ్గరగా వస్తుంటే మన కాళ్ళ దగ్గర భూమి కంపిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతలా ట్రైన్ కదలికలు, ఆ శబ్దం అంత భయంకరంగా ఉంటాయి. ఇవన్నీ సాధారణ రైళ్లు వస్తుంటే కలిగే ఫీలింగ్. అదే సాధారణ ట్రైన్స్ కి కొన్ని రెట్లు పెద్దదిగా, భారీగా ఉండే రాకాసి ట్రైన్ వస్తే ఎలా ఉంటుంది ? భయాన్ని కలిగించే అదొక అద్భుత దృశ్యం అనే చెప్పొచ్చు. ఇదంతా ప్రపంచంలోని అతిపెద్ద ట్రైన్ గురించే. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైన్ పేరు 'బి హెచ్ పి ఐరన్ ఓర్ ట్రైన్ '. ఇది ఆస్ట్రేలియాకి చెందినది. ఈ ట్రైన్ విశేషాలు తెలుసుకుందాం.

25
దీని బోగీల సంఖ్య, పొడవు ఎంతో తెలుసా ?

ఈ ట్రైన్ మొత్తం పొడవు 7.35 కిలోమీటర్లు. ఈ ట్రైన్ కి మొత్తం 682 భారీ వ్యాగన్లు(భోగీలు), ఈ ట్రైన్ ని నడపడానికి మొత్తం 8 భారీ ఇంజన్లు ఉంటాయి. ఇంత భారీ ట్రైన్ కదులుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే అద్భుతం అనిపిస్తుంది.

35
15000 బలమైన ఏనుగుల బరువుని తట్టుకోగల సామర్థ్యం

ఈ ట్రైన్ ఏకంగా 80వేల టన్నుల పైగా బరువుని మోయగలదు. ఈ ట్రైన్ ఏకంగా 82 వేల ఇనుప ఖనిజాన్ని రవాణా చేసి రికార్డు సృష్టించింది. అంటే ఈ ట్రైన్ 15000 బలమైన ఏనుగులకు సమానమైన బరువుని మోయగలదని అర్థం. అంత బరువు మోసే సమయంలో ఈ ట్రైన్ మొత్తం బరువు( ట్రైన్ + ఇనుపఖనిజం) దాదాపు 99,734 టన్నులు.

45
భూకంపం వస్తున్న శబ్దం

అంత భారీ బరువుతో 7.35 కిలోమీటర్ల పొడవైన ఈ ట్రైన్ వస్తుంటే 2 కిమీ దూరం నుంచే భూమి కంపిస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ట్రైన్ దగ్గరకు వచ్చినప్పుడు దీని 8 భారీ ఇంజన్లు చేసే గర్జనకు చెవులు తూట్లు పడేంత శబ్దం వస్తుంది. ఈ ట్రైన్ ఒక రైల్వే స్టేషన్ ని దాటాలి అంటే ఏకంగా 15 నిమిషాల సమయం పడుతుంది.

55
ఈ ట్రైన్ నియంత్రణ ఎలా సాధ్యం

ఈ రాక్షస రైలులో ఇంజిన్లు అన్నీ ఒకే చోటు ఉండవు. రైలు ముందు, మధ్యలో, చివరన ఇంజిన్లను పంచుతారు. ప్రతి ఇంజన్ లో లోకో పైలట్ ఉండరు. ఈ ట్రైన్ ని కంట్రోల్ చేయడానికి అధునాతన రేడియో కమ్యూనికేషన్, కంప్యూటర్ కో-ఆర్డినేషన్ సిస్టమ్‌ను వాడతారు.

Read more Photos on
click me!

Recommended Stories