AI and Water: నీళ్లు లేకపోతే ఏఐ కూడా పనిచేయదు.. ఏఐ పనిచేయాలంటే నీళ్లు కావాల్సిందే, ఎలా అంటే..

Published : Nov 17, 2026, 10:59 AM IST

AI and Water: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం బాగా పెరిగింది. ఏఐకి నీటికి సంబంధం లేదనుకుంటారు చాలా మంది. కానీ ఏఐ పనిచేయాలంటే నీళ్లు ఎంతో అవసరం. అదెలాగో తెలుసుకోండి.

PREV
13
నీటిని వాడేస్తున్న ఏఐ

ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా చాట్‌జీపీటీ, జెమిని లాంటి ఏఐ టూల్స్‌తో క్షణాల్లో రకరకాల ఫోటోలు తయారు చేస్తున్నారు. మనం ఒక చిన్న సూచన ఇస్తే చాలు.. అందమైన చిత్రాలు కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే ఇలా ఏఐతో ఫోటోలు తయారు చేయడానికి నీళ్లు కూడా ఖర్చవుతాయని మీకు తెలుసా? అవును.. ఏఐ ఫోటోలను నేరుగా నీళ్లతో తయారు చేయదు. కానీ వాటి వెనుక పనిచేసే భారీ కంప్యూటర్ల వల్ల నీటి వినియోగం జరుగుతుంది. ఈ కంప్యూటర్లు ఉండే భవనాలను డేటా సెంటర్లు అంటారు. మనం ఫోటో తయారు చేయమని సూచన ఇచ్చినప్పుడు ఈ డేటా సెంటర్లలోని కంప్యూటర్లు పనిచేసి చిత్రాన్ని రూపొందిస్తాయి. ఈ సమయంలో కంప్యూటర్లు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. వాటిని చల్లబరచడానికి కొన్ని డేటా సెంటర్లు నీటిని ఉపయోగిస్తాయి.

23
ఎన్ని రకాలుగా నీటిని వాడుతుందో తెలుసా?

అయితే ఏఐ వల్ల నీళ్లు ఖర్చయ్యేది కంప్యూటర్లను చల్లబరచడానికి మాత్రమే కాదు. ఏఐ కంప్యూటర్లు పనిచేయడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. ఈ విద్యుత్‌ను తయారు చేసే కొన్ని విద్యుత్ కేంద్రాల్లో కూడా నీటిని ఉపయోగిస్తారు. అంతేకాదు.. కంప్యూటర్లలో వాడే చిప్‌ల తయారీకి కూడా నీరు అవసరం. ఇలా మూడు మార్గాల్లో ఏఐ వల్ల నీటి వినియోగం జరుగుతుంది. అయితే అన్ని డేటా సెంటర్లు ఒకే పద్ధతిలో పనిచేయవు. కొన్ని గాలి ద్వారా కంప్యూటర్లను చల్లబరుస్తాయి. మరికొన్ని నీటిని తిరిగి ఉపయోగించే ప్రత్యేక వ్యవస్థలను వాడతాయి. అందువల్ల ప్రతి ఏఐ ఫోటో తయారీకి ఒకే స్థాయిలో నీరు ఖర్చవుతుందని చెప్పలేం.

33
ఎంత నీరు ఖర్చవుతుంది?

ఒక ఏఐ ఫోటో తయారు చేయడానికి ఎన్ని నీళ్లు ఖర్చవుతాయనే దానిపై ఇప్పటివరకు అందరికీ వర్తించే కచ్చితమైన లెక్క లేదు. ఎందుకంటే ఏఐ టూల్, ఫోటో పరిమాణం, కంప్యూటర్ల సామర్థ్యం, డేటా సెంటర్‌లో వాడే చల్లబరిచే పద్ధతిని బట్టి నీటి వినియోగం మారుతుంది. 2025 ఆగస్టులో గూగుల్ విడుదల చేసిన పరిశోధన ప్రకారం, జెమిని ద్వారా ఒక సాధారణ టెక్స్ట్ ప్రశ్నకు సగటున 0.26 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతుంది. అంటే సుమారు ఐదు నీటి చుక్కలు. అయితే ఇది కేవలం టెక్స్ట్ ప్రశ్నకు సంబంధించిన లెక్క మాత్రమే. ఏఐ ఫోటో తయారీకి కూడా ఇంతే నీరు ఖర్చవుతుందని భావించకూడదు. కాబట్టి ఏఐతో ఫోటోలు తయారు చేయడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే పెరుగుతున్న ఏఐ వినియోగానికి అనుగుణంగా నీరు, విద్యుత్ ఆదా చేసే సాంకేతికతలను కంపెనీలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories