మొసలిని కూడా వేటాడే వింత పక్షి గురించి మీకు తెలుసా? మెషిన్ గన్ లాంటి శబ్దం చేసే ఈ జీవులు ఎక్కడుంటాయంటే?

Published : Nov 17, 2026, 10:58 AM IST

సాధారణంగా పక్షుల ఆహారం ఏముంటుంది. గింజలు, చిన్న చిన్న పురుగులు తింటాయి. కొంగలు,గద్దలు చేపలను వేటాడుతాయి. కానీ ఏకంగా మొసలిని కూడా వేటాడి తినగలిగే పక్షి గురించి మీకు తెలుసా? డైనోసర్ ఆకారం, మెషిన్ గన్ లా శబ్ధం చేసే జీవి ఏది?

PREV
13
ఆఫ్రికాలోని చిత్తడి నేలల్లో నివాసం..

ప్రకృతిలో ఎన్నో వింత జీవులు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం చూడగానే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆఫ్రికాలోని చిత్తడి నేలల్లో నివసించే షూబిల్ పక్షి (Shoebill) అలాంటి అరుదైన జీవుల్లో ఒకటి. “షూబిల్ పక్షి గురించి మీకు తెలియని నిజాలు.. మొసలిని కూడా వేటాడే వింత పక్షి ... ఈ పక్షి రూపం, వేట విధానం, ఆహారపు అలవాట్లు, పిల్లల పెంపకం, శబ్దాల గురించి ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం?

23
షూ ఆకారపు ముక్కు.. వింత వేట

చిత్తడి నేలలో గంటల తరబడి కదలకుండా నిలబడి ఉండే ఈ పక్షిని చూస్తే తొలుత పక్షి అని నమ్మడం కష్టంగా అనిపిస్తుంది. భారీ ముక్కు, గంభీరమైన కళ్లు, డైనోసార్‌ను గుర్తుచేసే రూపం దీని ప్రత్యేకత. దీని ముక్కు అచ్చం ఒక పెద్ద షూ ఆకారంలో ఉండటం వల్లే దీనికి ‘షూబిల్’ అనే పేరు వచ్చింది. ఆఫ్రికాలోని ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి ప్రాంతాల్లోని చిత్తడి నేలలు వీటి ఆవాసాలు. దాదాపు నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగే ఈ పక్షి ముక్కు చాలా పెద్దదిగా ఉంటుంది.

ఓపికతో సాగే వేట, ఆహారం కోసం ఏం చేస్తుంది?

షూబిల్ భారీ ముక్కు కేవలం వింతగా కనిపించడానికి మాత్రమే కాదు, వేటలో కీలక పాత్ర పోషిస్తుంది . ఇది ప్రధానంగా ‘లంగ్‌ఫిష్’ అనే చేపలను వేటాడుతుంది. నీళ్లలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు గాలి పీల్చుకోవడానికి ఈ చేపలు నీటిపైకి వస్తాయి. ఆ అవకాశం కోసం షూబిల్ ఓపికగా ఎదురు చూస్తుంది. చేప దగ్గరకు రాగానే ఒక్కసారిగా భారీ తలను ముందుకు విసురుతూ నీళ్లలోకి దూకి, ముక్కుతో చేపను గట్టిగా పట్టుకుంటుంది. కొన్నిసార్లు వేటలో శరీరం మొత్తం ముందుకు వరిగిపోతే, తిరిగి నిలబడటానికి రెక్కలను ఉపయోగిస్తుంది. ఇది కేవలం చేపలకే పరిమితం కాదు; క్యాట్‌ఫిష్, నీటి పాములు, కప్పలు, అవకాశం దొరికితే చిన్న మొసళ్లను కూడా వేటాడి తినేయగలదు.

33
మెషిన్ గన్ లాంటి శబ్దం చేసే పక్షి..

షూబిల్ సాధారణంగా ఒక గూటిలో రెండు గుడ్లు పెట్టి, తల్లిదండ్రులు రెండింటినీ పెంచుతాయి]. ఆహారం తక్కువగా ఉన్నప్పుడు పెద్ద పిల్లకు ఎక్కువ ఆహారం దొరికి, కొన్నిసార్లు చిన్న పిల్లపై దాడి చేస్తుంది. దీనివల్ల చిన్న పిల్ల బతికే అవకాశాలు తగ్గి, కొన్ని గూళ్లలో చివరికి ఒక్క పిల్ల మాత్రమే పెద్దదవుతుంది.

అలాగే, ఈ పక్షి తన ముక్కును వేగంగా ఒకదానికొకటి కొట్టుకుంటూ మెషిన్ గన్ కాల్పుల శబ్దంలాంటి ధ్వని చేస్తుంది. జంట కలిసినప్పుడు, గూటి దగ్గర ఉన్నప్పుడు చేసే ఈ శబ్దాన్ని ‘బిల్ క్లాటరింగ్’ అంటారు. చూడటానికి డైనోసార్‌లా కనిపిస్తూ, వింత శబ్దం చేసే షూబిల్ ప్రకృతిలోని అద్భుత కథలకు నిదర్శనంగా నిలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories