మరణం తరువాత కూడా మనుషుల శరీర భాగాలు ఎందుకు కదులుతాయి? వైద్య శాస్త్రం ఏమంటోంది?

Published : Nov 24, 2026, 05:20 PM IST

మరణం తర్వాత కూడా కొన్నిసార్లు మనుషుల శరీర భాగాలు ఎందుకు కదులుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని వెనుక దాగి ఉన్న అసలు శాస్త్రీయ కారణాలను ఇక్కడ తెలుసుకోండి.

PREV
13
మరణం తరువాత..

మరణం తర్వాత కూడా మనుషుల శరీర భాగాలు కొన్నిసార్లు కదులుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం వెన్నుపాములో ఉండే నాడీ వ్యవస్థ. మనిషి మెదడు పనిచేయడం పూర్తిగా ఆగిపోయిన తర్వాత కూడా వెన్నుపాములోని నాడీ కణాలు కొంతసేపు చురుకుగా ఉంటాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్ల లేదా బయటి స్పర్శ వల్ల ఈ కణాలు ప్రేరేపితమై చేతులు, కాళ్లు ఒక్కసారిగా కదలడం లేదా వేళ్లు అదరడం జరుగుతుంది. 1984లో న్యూరాలజిస్ట్ డాక్టర్ అలన్ హెచ్ రోపర్ చేసిన అధ్యయనంలో బ్రెయిన్ డెడ్ అయిన రోగుల చేతులు ఛాతీ వైపు లేవడం గమనించారు. 2005లో డాక్టర్ గుస్తావో సపోస్నిక్ 107 మందిపై చేసిన పరిశోధనలో దాదాపు 47 శాతం మందిలో ఇలాంటి అసంకల్పిత కదలికలు కనిపించాయని తేలింది

23
సీపీఆర్ చేసిన తరువాత

రెండో ప్రధాన కారణం సీపీఆర్ ఆపిన తర్వాత గుండె మళ్లీ కొట్టుకోవడం. వైద్య పరిభాషలో దీన్ని ఆకస్మిక పునరుజ్జీవనం అంటారు. సీపీఆర్ చేస్తున్నప్పుడు ఊపిరితిత్తులలో గాలి ఒత్తిడి పెరుగుతుంది. సీపీఆర్ ఆపగానే ఛాతీపై ఒత్తిడి తగ్గి రక్తం తిరిగి గుండెకు చేరుతుంది. అలాగే అంతకుముందు ఇచ్చిన మందులు ఆలస్యంగా పనిచేయడం వల్ల కూడా గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. 1982 నుంచి 2022 చివరి వరకు 27 దేశాల్లో ఇలాంటి 76 అరుదైన కేసులు నమోదైనట్లు 2023 అధ్యయనం వెల్లడించింది.

33
ఇది మరో కారణం

మూడో కారణం శరీరం కుళ్లిపోయే ప్రక్రియలో వచ్చే మార్పులు. మరణించిన తర్వాత శరీరంలోని కణజాలాలు విచ్ఛిన్నమై వాయువులు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మొదట శరీరం ఉబ్బుతుంది. ఆ తర్వాత చర్మం, కండరాలు, కీళ్లను కలిపి ఉంచే కణజాలం ఎండిపోయి కుంచించుకుపోతాయి. ఇలా బిగుసుకుపోవడం వల్ల ఎముకలు, అవయవాలు తమ స్థానం నుంచి పక్కకు జరుగుతాయి. 2020లో ఫోరెన్సిక్ శాస్త్రవేత్త అలిసన్ విల్సన్ బృందం 16 నెలల పాటు టైమ్ ల్యాప్స్ కెమెరాలతో మృతదేహాన్ని పరిశీలించింది. ఈ పరిశోధనలో చేతి ఎముక ఏకంగా 51.65 సెంటీమీటర్ల మేర కదిలినట్లు గుర్తించారు. ఈ మూడు శాస్త్రీయ కారణాల వల్లే మరణానంతరం శరీరంలో కదలికలు కనిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories