ఎందుకు కనిపించవంటే..
అమెరికాలో కొత్త కాలనీ కట్టే ముందే ఒక పక్కా ప్లాన్ ఫాలో అవుతారు. ఇళ్లు కట్టకముందే కరెంటు, గ్యాస్ పైప్‌లైన్, ఇంటర్నెట్ (ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్), తాగునీటి పైపులను భూమి లోపల (అండర్ గ్రౌండ్) సిస్టమాటిక్‌గా వేస్తారు. ప్రతి ఇంటికి కావాల్సిన కనెక్షన్లు అన్నీ భూమి లోపలి నుంచే ఇస్తారు. అందుకే బయట ఎలాంటి వైర్లు, స్తంభాలు కనిపించవు. అంతా అక్కడ అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి.
ఇళ్లు, రోడ్ల అందం చెడిపోకూడదనేదనే ఇలా అక్కడ ప్లాన్ చేశారు. స్తంభాలు, చిక్కుబడిన వైర్లు ఉంటే ఆ ప్రాంతం అందవిహీనంగా మారుతుంది. ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ వల్ల మొత్తం ఏరియా చాలా నీట్‌గా, అందంగా కనిపిస్తుంది.