Diwali Gifts: దీపావళికి చాలా కంపెనీలో ఇండియాలో గిఫ్టులు ఇచ్చారు. అయితే కొన్ని కంపెనీలు ఏకంగా కార్లు, బంగారం, ఐఫోన్లు గిఫ్టుగా ఇచ్చారు. అలాంటి కంపెనీల గురించి ఇక్కడ ఇచ్చాము.
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు కార్పొరేట్ ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతుల సందడి మొదలవుతుంది. దేశంలో పనిచేసే చిన్న, పెద్ద కంపెనీలు తమ సిబ్బందిని సంతోషపెట్టేందుకు రకరకాల కానుకలు ప్రకటిస్తుంటాయి. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా (హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్) గతంలో తన ఉద్యోగులకు వందలాది కార్లు, ఇళ్లు/ఫ్లాట్లు బహుమతులుగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. హర్యానాకు చెందిన ఎంఐటీఎస్ (MITS) హెల్త్‌కేర్ గ్రూప్ ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు కియా సోనెట్ (Kia Sonet) కార్లను గిఫ్ట్‌గా అందించారు. రాజస్థాన్‌కు చెందిన మీడియాగార్హ్ వంటి సంస్థలు టాటా హారియర్, హ్యుందాయ్ కార్లను కొంతమందికి ఉద్యోగులకు పంపిణీ చేశాయి.
23
దీపావళికి ఐఫోన్లు గిఫ్టుగా..
ఢిల్లీలోని ఫైనాన్షియర్ సాబ్ అనే సంస్థ తన ఉద్యోగులకు ఐఫోన్ 16 ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. వాటి ఒక్కోదాని విలువ 70,000 రూపాయలు ఉంటుంది. గుజరాత్ లోని సూరత్ నగరానికి చెందిన వస్త్ర వ్యాపారి రామ్ స్వరూప్ దీపావళికి 20 మంది ఉద్యోగులకు బోనస్ గా లక్ష రూపాయలకు పైగా డబ్బులు బహుమతిగా ఇచ్చారు. మరికొన్ని కంపెనీలు 20 గ్రాముల బంగారం, ఎయిర్ ఫ్రైయర్లు, కాఫీ మెషీన్లు వంటివి అందించారు.
33
అంబానీ, అదానీలు ఏమిచ్చారు?
మరోవైపు దేశంలోనే అగ్రశ్రేణి సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ సంస్థలు ఇచ్చే పండుగ కానుకలపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అయితే వీరు కార్లు, ఇళ్ల వంటి విలాసవంతమైన వస్తు రూప బహుమతులకు ప్రాధాన్యం ఇవ్వరు. రిలయన్స్, అదానీ గ్రూపులలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. పండుగ అలవెన్సులు, పనితీరు ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహక బోనస్‌లు, కంపెనీ స్టోర్లలో షాపింగ్ చేసుకునే ప్రత్యేక రాయితీ కూపన్లు, ప్రీమియం స్వీట్ బాక్సులను సిబ్బందికి అందజేస్తారు. ఉద్యోగుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ అయ్యే విధానాన్ని ఈ సంస్థలు ఎక్కువగా పాటిస్తాయి.