రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేస్తే నేరం.. ఈ నిబంధన ఎక్కడుంది? ఇందులో నిజ‌మెంత‌

Published : Oct 03, 2026, 06:41 PM IST

Viral News: ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వాటిలో కొన్ని వినడానికి చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి వాటిలో స్విట్జర్లాండ్‌కు సంబంధించిన ఓ నిబంధన గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతోంది.

PREV
15
రాత్రి 10 తర్వాత ఫ్లష్ చేస్తే నేర‌మా.?

స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయడం చట్టవిరుద్ధమని, అలా చేస్తే జైలుకు పంపిస్తారని చాలా కాలంగా సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో పూర్తిగా నిజం లేదు. ఇది స్విట్జర్లాండ్‌ దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రభుత్వ చట్టం కాదు. అంటే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఫ్లష్ చేశారనే కారణంతో నేరుగా జైలుకు పంపించే జాతీయ స్థాయి చట్టం అక్కడ లేదు.

25
మరి ఈ నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది.?

స్విట్జర్లాండ్‌లో అపార్ట్‌మెంట్లు, అద్దె ఇళ్లలో రాత్రి సమయంలో శబ్దం చేయకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. వీటిని స్థానికంగా ఇంటి నియమాలు లేదా హౌస్ రూల్స్‌గా పరిగణిస్తారు. కొన్ని భవనాల్లో రాత్రి సమయంలో టాయిలెట్ ఫ్లష్ చేయడం, వాషింగ్ మెషీన్ ఉపయోగించడం వంటి శబ్దం వచ్చే పనులపై పరిమితులు ఉంటాయి. ఇవి సాధారణంగా ఇంటి యజమాని లేదా భవన నిర్వాహకులు నిర్ణయించే నిబంధనలు. అంతేత‌ప్ప వీటి కార‌ణంగా జైలు శిక్ష ప‌డ‌దు.

35
టాయిలెట్ ఫ్లష్‌పై ఎందుకు నిబంధనలు పెడతారు.?

స్విట్జర్లాండ్‌లో రాత్రి సమయంలో ప్రశాంత వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా పాత అపార్ట్‌మెంట్లలో గోడలు పలుచగా ఉండటం వల్ల చిన్న శబ్దాలు కూడా పక్కింటికి వినిపించే అవకాశం ఉంటుంది. టాయిలెట్ ఫ్లష్ శబ్దం కూడా రాత్రి సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే కొన్ని భవనాల్లో రాత్రి సమయంలో శబ్దాన్ని తగ్గించేలా నియమాలు పెడుతుంటారు.

45
నిబంధన పాటించకపోతే ఏం జరుగుతుంది.?

ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దె ఒప్పందం లేదా భవన నియమాల్లో రాత్రి శబ్దానికి సంబంధించిన నిబంధనలు ఉంటే వాటిని పదేపదే ఉల్లంఘించినప్పుడు ఇంటి యజమాని హెచ్చరించవచ్చు. పొరుగువారు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. సమస్య తరచూ కొనసాగితే అద్దె ఒప్పందానికి సంబంధించిన చర్యలు తీసుకునే పరిస్థితి రావచ్చు. అయితే ఒక్కసారి రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేశారనే కారణంతో నేరుగా జైలుకు పంపిస్తారనడం సరైనది కాదు.

55
అసలు నిజం ఏంటి.?

స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేస్తే జైలు శిక్ష పడుతుందనే ప్రచారం అతిశయోక్తితో కూడుకున్నదే. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న అలాంటి ప్రత్యేక చట్టం లేదు. అయితే కొన్ని ఇళ్లలో రాత్రి సమయంలో శబ్దం చేయకుండా ఉండేందుకు హౌస్ రూల్స్ ఉంటాయి. అందువల్ల స్విట్జర్లాండ్‌కు వెళ్లేవారు అక్కడ ఉంటున్న అపార్ట్‌మెంట్ లేదా హోటల్‌కు సంబంధించిన స్థానిక నియమాలను తెలుసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories