Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్ రైళ్ల మధ్య తేడాలు ఏంటి? బడ్జెట్ జర్నీకి ఏది బెస్ట్?

Published : Sep 23, 2026, 01:26 PM IST

Vande Bharat vs Amrit Bharat: వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు అద్భుతమైన ప్రయాణం అందిస్థాయి. అయితే, ఈ రెండు రైళ్ల మధ్య తేడాలేంటో తెలుసా? స్పీడ్, ఛార్జీలు, ఏసీ సౌకర్యం, రూట్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

PREV
16
సామాన్యుల సూపర్ ఫాస్ట్ రైలు అమృత్ భారత్.. వందే భారత్‌తో పోలిస్తే ఏది బెస్ట్?

భారతీయ రైల్వే రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే లేట్ అవ్వడం, కుదుపులే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మనదేశంలో ట్రాక్స్‌పై పరుగులు తీస్తున్న 'వందే భారత్', 'అమృత్ భారత్' రైళ్లు ప్రయాణికులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయి. చూడటానికి రెండూ మోడర్న్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నప్పటికీ.. వీటి పనితీరు, ఉద్దేశం, సౌకర్యాలు మాత్రం పూర్తిగా వేరు. అసలు ఈ రెండు రైళ్ల మధ్య తేడాలు ఏంటి? ప్రయాణానికి ఏది బెస్ట్ ఆప్షన్? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

26
లక్ష్యం వేరు.. ప్రయాణికుల టార్గెట్ వేరు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది ముఖ్యంగా పగటిపూట వేగంగా, లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారి కోసం డిజైన్ చేశారు. బిజినెస్ పీపుల్, టూరిస్టులు, సమయం ఆదా చేసుకోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది ఎక్కువగా 10 గంటలలోపు చేరుకునే ఇంటర్‌సిటీ మార్గాల్లో నడుస్తుంది.

మరోవైపు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సామాన్యులు, వలస కార్మికులు, బడ్జెట్ ట్రావెలర్స్ కోసం తీసుకొచ్చిన రైలు. సుదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. రాత్రివేళల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో అమృత్ భారత్ సేవలు అందిస్తోంది.

36
ఏసీ లగ్జరీ vs బడ్జెట్ నాన్-ఏసీ

కోచ్‌ల రకాన్ని పరిశీలిస్తే ఈ రెండింటికీ చాలా తేడా ఉంది..

• వందే భారత్: ఇది పూర్తిగా ఎయిర్-కండిషన్డ్ రైలు. ఇందులో ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ క్లాస్‌లు ఉంటాయి. అలాగే సరికొత్తగా 16 కోచ్‌లతో కూడిన వందే భారత్ ఏసీ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, ఆన్-బోర్డ్ కేటరింగ్ ఫుడ్, వైఫై, రివాల్వింగ్ సీట్లు వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.

• అమృత్ భారత్: ఇది ప్రాథమికంగా నాన్-ఏసీ రైలు. మొత్తం 22 కోచ్‌లతో నడిచే ఈ రైలులో 12 స్లీపర్, 8 అన్‌రిజర్వ్‌డ్ జనరల్, 2 లగేజ్/దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయి. నాన్-ఏసీ అయినప్పటికీ ప్రతి సీటు వద్ద యూఎస్ బీ ఛార్జింగ్ పాయింట్లు, మొబైల్ హోల్డర్లు, కుషన్లతో కూడిన బెర్త్‌లు, ఆధునిక ఎల్ఈడీ లైటింగ్, జీరో-డిశ్చార్జ్ బయో టాయిలెట్లను అందించడం విశేషం.

46
పుష్-పుల్ టెక్నాలజీ vs సెల్ఫ్-ప్రొపెల్డ్ సిస్టమ్

సాంకేతిక పరంగా ఈ రెండు రైళ్ల ఇంజిన్ డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది..

• వందే భారత్ : ఈ రైలుకు ప్రత్యేకంగా ముందు భాగంలో పెద్ద ఇంజిన్ ఉండదు. మెట్రో రైళ్ల లాగే ప్రతి కోచ్ కింద మోటార్లు ఉంటాయి అంటే డిస్ట్రిబ్యూటెడ్ పవర్ సిస్టమ్. దీనివల్ల రైలు చాలా వేగంగా పిక్-అప్ అందుకుంటుంది. దీని డిజైన్ స్పీడ్ 180 kmph కాగా, ట్రాక్ పరిస్థితులను బట్టి 130 నుండి 160 kmph ఆపరేటింగ్ స్పీడ్‌తో నడుస్తుంది.

• అమృత్ భారత్: ఈ రైలుకు ముందు ఒక WAP-5 ఇంజిన్, వెనుక మరో WAP-5 ఇంజిన్ ఉంటాయి. ముందున్న ఇంజిన్ లాగుతుంటే, వెనుక ఉన్న ఇంజిన్ తోస్తుంది. దీనివల్ల వేగంగా పిక్-అప్ రావడమే కాకుండా ప్రయాణంలో ఎలాంటి కుదుపులు ఉండవు. దీని గరిష్ట ఆపరేషనల్ స్పీడ్ 130 kmph.

56
భద్రతలో కాంప్రమైజ్ లేనే లేదు

వేగం, సౌకర్యం ఏది ఉన్నా భద్రత చాలా ముఖ్యం. ఈ విషయంలో భారతీయ రైల్వేస్ రెండింటిలోనూ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు అందించింది.

రెండు రైళ్లలోనూ ప్రమాదాలను నివారించే 'కవచ్' సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడే టాక్-బ్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. అమృత్ భారత్‌లో అదనంగా ఫైర్-సప్రెషన్ సిస్టమ్, కట్టుదిట్టమైన క్రాష్‌వర్తీనెస్ ఫీచర్లు అమర్చారు. వందే భారత్‌లో ప్రయాణికులకు అనౌన్స్‌మెంట్స్ కోసం ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది.

66
టికెట్ ధరలు.. ప్రయాణం ఎవరికి సూటవుతుంది?

టికెట్ రేట్ల విషయానికి వస్తే అమృత్ భారత్ చాలా సరసమైన ధరల్లో లభిస్తుంది. సాధారణ స్లీపర్ ఛార్జీల కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువ ఉంటుంది. సుదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చులో ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

వందే భారత్ ఛార్జీలు ప్రీమియం స్థాయిలో ఉంటాయి. పగటిపూట వేగంగా, ఏసీ సౌకర్యంతో హోటల్ తరహా అనుభూతిని కోరుకునే వారికి వందే భారత్ సరైన ఎంపిక.

సింపుల్‌గా చెప్పాలంటే.. మీ ప్రాధాన్యం లగ్జరీ ప్రయాణం, వేగం అయితే వందే భారత్ ఎంచుకోవచ్చు. అదే తక్కువ బడ్జెట్‌లో దూర ప్రయాణం చేయాలనుకుంటే అమృత్ భారత్ బెస్ట్ ఛాయిస్.

Read more Photos on
click me!

Recommended Stories