Car Driver Salary: అమెరికాలో కారు నడిపితే నెలకు ఎంత వస్తుందో తెలుసా? దెబ్బకు లైఫ్ సెటిల్

Published : Jul 23, 2026, 05:14 PM IST

Car Driver Salary: అమెరికాలో ఉద్యోగాల గురించి మాట్లాడితే చాలా మంది ముందుగా గుర్తుకొచ్చేది ఊబర్ డ్రైవింగ్. రోజుకు కొన్ని గంటలు కారు నడిపితే వేల డాలర్లు వస్తాయట. నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తారనే టాక్ ఉంది. కానీ ఇందులో నిజమెంత?

PREV
14
ఎంత సేపు పనిచేస్తే అంత డబ్బులు

Uber డ్రైవర్లు అంటే ఏదో కంపెనీ ఉద్యోగులు కాదు. వీరు ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు. అంటే ఎప్పుడు పనిచేయాలనేది, ఎంతసేపు పనిచేయాలనేది డ్రైవర్ ఇష్టమే. ఎన్ని ఎక్కువ గంటలు పనిచేస్తే అంత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది.

24
రూ.4లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు ఆదాయం

అమెరికాలో పూర్తి సమయం Uber నడిపే డ్రైవర్ నెలకు సగటున 4,800 నుంచి5,300 అమెరికన్ డాలర్ల వరకు గ్రాస్ ఆదాయం పొందే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.4లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు అవుతుంది. అయితే ఇది చేతికి వచ్చే మొత్తం కాదు. ఇందులో ఇంధనం, కారు మెయింటెయిన్, ఇన్సూరెన్స్, వాహన లోన్ లేదా లీజ్, టోల్ ఫీజులు, ట్యాక్స్ వంటి ఖర్చులు ఉంటాయి.

34
ఏరియా బట్టి ఆదాయం

ఈ ఖర్చులన్నీ తీసేస్తే నికర ఆదాయం నగరం, పని గంటలు, ప్రయాణికుల డిమాండ్‍ను బట్టి మారుతుంది. న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి పెద్ద నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆదాయం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న నగరాల్లో మాత్రం సంపాదన తక్కువగా ఉండొచ్చు.

44
పిండి కొద్ది రొట్టే..వీకెండ్స్ లో డబ్బులే డబ్బులు

వీకెండ్స్, పండుగలు, ఈవెంట్లు జరిగే రోజుల్లో Uber సర్జ్ ప్రైసింగ్ అమలు చేస్తుంది. అలాంటి సమయంలో సాధారణ రోజుల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకే చాలా మంది డ్రైవర్లు ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ లేదా వీకెండ్లలో ఎక్కువగా పని చేస్తారు. అయితే ఆదాయం ఎక్కువగా కనిపించినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని డ్రైవర్లు చెబుతున్నారు. కారు మైలేజ్ పెరగడం, టైర్లు, సర్వీసింగ్, పెట్రోల్, డీజిల్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం అని ఖర్చులు తీసేసిన తర్వాత కొందరు డ్రైవర్ల అసలు లాభం తక్కువగా ఉండొచ్చని చెబుతున్నాయి.

అందుకే అమెరికాలో Uber డ్రైవింగ్‍ను చాలా మంది ఒక ఉద్యోగంలా కాకుండా పార్ట్ టైంలా ఉపయోగిస్తున్నారు. మరోవైపు చాలా మంది పూర్తి సమయం దీనికోసమే పనిచేస్తూ పక్కా ప్లాన్‍తో నెలకు లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories