ఇండియాలో టన్నుల కొద్ది బంగారం ఉన్న టాప్ 5 దేవాలయాలు ఏవో తెలుసా? దేశంలోనే రిచ్ టెంపుల్స్?

Published : Nov 13, 2026, 01:34 PM IST

భారతదేశం దైవభూమి.. కొన్ని లక్షల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఎన్నోవేల, లక్షల ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్స్ ఇండియాలో ఉన్నాయి. కొన్ని దేవాలయాలకు దేశాల బడ్జెట్ ను మించిన సంపద ఉంది. అత్యధిక బంగారం, సంపద కలిగిన టాప్ 5 గుళ్ల గురించి మీకు తెలుసా?

PREV
15
టన్నుల కొద్ది బంగారం ఉన్న టాప్ 5 దేవాలయాలు

భారతదేశం సంస్కృతికి, సంప్రదాయాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అపారమైన సంపద గల దేవాలయాలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. మన దేశంలోని కొన్ని ఆలయాల వద్ద టన్నుల కొద్దీ బంగారం, వందల కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉన్నాయి. భక్తులు సమర్పించే కానుకలు, చారిత్రక సంపద ఆధారంగా భారతదేశంలో అత్యధిక బంగారు ఖజానా కలిగిన టాప్-5 ధనిక దేవాలయాల గురించి చూద్దాం.

5. పూరీ జగన్నాథ్ దేవాలయం (ఒడిస్సా)

ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఒడిస్సాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ్ ఆలయం ఉంది. ఈ పవిత్ర క్షేత్రంలో కొలువైన శ్రీ జగన్నాథునికి ప్రతిరోజూ అత్యంత వైభవంగా ఏకంగా 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ ఆలయానికి చెందిన ఏడు గదుల ఖజానాలో సుమారు 150 కిలోల స్వచ్ఛమైన బంగారంతో పాటు, టన్నుల కొద్దీ వెండి ఆభరణాలు ఉన్నట్లు అంచనా. ఈ మొత్తం ఖజానా విలువ వందల కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు.

25
4. వైష్ణోదేవి ఆలయం (జమ్మూ కాశ్మీర్)

జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తైన కొండల మీద వెలసిన వైష్ణోదేవి ఆలయం నాలుగో స్థానంలో ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఏటా కోటి మందికి పైగా భక్తులు దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఈ గుడికి ఏటా దాదాపు రూ. 500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఈ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో టన్నుల కొద్దీ బంగారం , వేల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.

35
3. శిరిడీ సాయిబాబా దేవాలయం (మహారాష్ట్ర)

మహారాష్ట్రలోని శిరిడీలో వెలసిన సాయిబాబా దేవాలయం మూడవ స్థానంలో నిలిచింది. ఈ ప్రసిద్ధ ఆలయానికి ప్రతి సంవత్సరం సుమారు రూ. 400 కోట్ల వరకు విరాళాలు వస్తుంటాయి. వివిధ బ్యాంకుల్లో ఈ ఆలయానికి దాదాపు రూ. 2,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అంతేకాకుండా, స్వామివారి అలంకరణ కోసం వినియోగించే సుమారు 380 కిలోల బంగారం, 4,500 కిలోల వెండి ఈ ఆలయ సొంతం.

45
2. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం (ఆంధ్రప్రదేశ్)

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం రెండో స్థానంలో ఉంది. (మొదటి స్థానం విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న ఈ శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రోజువారీగా సగటున 4 కోట్ల వరకు ఉంటుంది.

స్వామివారి పేరు మీద వివిధ బ్యాంకుల్లో సుమారు 11,000 కిలోల బంగారం, అలాగే రూ. 15,000 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నట్లు అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. అంతే కాదు భూములు, ఇతర ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుంది. ఈరకంగా తిరుమల స్వామివారే మొదటి ప్లేస్ లో ఉన్నట్టు. కానీఅనంత పద్మనాభస్వామి గుడి ప్రస్తుతం పస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

55
1. అనంత పద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రథమ స్థానంలో నిలిచింది. తిరుమల సంపదను సైతం మించేలా ఈ ఆలయ చరిత్ర ఉంది. 2011వ సంవత్సరంలో ఇక్కడ ఉన్న ఆరు నేలమాళిగల్లో ఐదు గదులను తెరిచి చూడగా, ఏకంగా రూ. 1.2 లక్షల కోట్ల విలువైన స్వచ్ఛమైన బంగారు కిరీటాలు, విలువైన వజ్రాలు, పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.

అయితే ఇప్పటికీ తెరవకుండా నాగబంధంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య బంధించి ఉన్న 'బి' (B) నేలమాళిగ వెనుక అంతుచిక్కని రహస్యం దాగి ఉంది. ఆ గదిని తెరిస్తే దాదాపు రూ. 5 లక్షల కోట్ల సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే తిరుమల ఆలయానికి.. పద్మనాభ స్వామి ఆలయానికే ఎక్కువ సంపద ఉంది. రెండు ఆలయాలలో ఏది మొదటి స్థానం అన్న విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories