డాయిష్ బ్యాంక్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రధాన నగరాలను ఎంపిక చేశారు. న్యూయార్క్, జ్యూరిచ్, జెనీవా వంటి గ్లోబల్ నగరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నగరాలన్నింటినీ వెనక్కి నెట్టి, డేటింగ్ కోసం బెంగళూరు అత్యంత చవకైన నగరంగా నిలిచింది.
ఈ సర్వేలో ఒక సాధారణ డేట్ నైట్‌కు అయ్యే ఖర్చును సరిపోల్చారు. డిన్నర్, వైన్, కాఫీ, సినిమా టిక్కెట్లు, రవాణా, బట్టల షాపింగ్.. ఇవన్నీ కూడా ప్రేమికులు ఎక్కువగా కొనేవి. వీటి ధరలన్నింటినీ కలిపి ఒక జంటకు బెంగళూరులో సుమారు 104 డాలర్లు రూ. 9,427 ఖర్చవుతుంది. ప్రపంచ నగరాలతో పోలిస్తే ఇది మూడింట ఒక వంతు కంటే తక్కువ. అందుకే బెంగళూరు డేటింగ్‌కు బడ్జెట్ ఫ్రెండ్లీ నగరంగా నిలిచింది.