Strange Village: అక్కడ ఊరి బయటే మహిళల బతుకు.. ఆ ఐదు రోజులు ప్రాణాలు అరచేతిలోనే!

Published : Oct 23, 2026, 11:47 AM IST

Strange Village: రాకెట్ యుగంలో కూడా మూఢనమ్మకాలు మనుషులను ఎంత దిగజార్చుతున్నాయో తెలుసా? ముఖ్యంగా మహిళల పట్ట కొన్ని ప్రాంతాల్లో ఎంత చిన్న చూపు ఉందంటే..ఓ ఊరిలో ఆడవారిని నెలలో 5 రోజులు ఊరి నుంచి బహిష్కరించి..అడవిలో వదిలేస్తారట. కారణం ఏంటంటే?

PREV
13
మూఢనమ్మకాలు నీడలు వదలడంలేదు..

టెక్నాలజీ పరుగులు పెడుతున్న నేటి సమాజంలో కూడా.. ఇంకా పాత మూఢనమ్మకాల నీడలు మాత్రం వదలడంలేదు. మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలో కూడా కొన్ని ప్రాంతాలలో వివక్షను ఎదురుకోక తప్పడంలేదు. ఆధునిక సమాజం ఎంతగా ముందుకు సాగుతున్నా కొన్ని ప్రాంతాలలో ఆడవారిపై ఆంక్షలు తప్పడంలేదు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న దారుణాలు వింటే ఎవరైనా ఆశ్చర్చపోవాల్సిందే.

23
5 రోజులు ఊరి నుంచి వెలివేస్తారు..

గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి వంటి అటవీ ప్రాంతాల్లో నివసించే మాదియా గొండు తెగల్లో అలాగే నేపాల్ సరిహద్దు పల్లెల్లో ‘గావ్‌కోర్’ లేదా ‘ఛౌపడీ’ పేరిట ఒక అమానవీయ ఆచారం కొనసాగుతోంది. స్త్రీలకు నెలసరి రావడం అనేది సహజమైన శారీరక ప్రక్రియ అయినప్పటికీ, ఆ రోజుల్లో వారిని అపవిత్రులుగా పరిగణిస్తారు. రుతుక్రమం మొదలైన వెంటనే మహిళలను ఊరి నుంచి బలవంతంగా బయటకు పంపిస్తారు. గ్రామానికి దూరంగా అడవి సరిహద్దుల్లో ఉండే శిథిలావస్థకు చేరిన పాకలు, గుడిసెల్లో వారు ఐదు రోజుల పాటు ఒంటరిగా గడపాల్సి ఉంటుంది.

భోజనం కూడా పెట్టకుండా హింసిస్తున్నారు..

అడవుల్లోని ఆ బహిష్కరణ కుటీరాలలో ఎలాంటి కనీస వసతులు ఉండవు. తలుపులు సరిగ్గా ఉండవు, లైట్లు ఉండవు, కనీసం టాయిలెట్స్ కూడా ఉండవు. వర్షం కురిసినా, విపరీతమైన చలి వేసినా, ఎండ ఉన్నా మహిళలు ఆ చీకటి గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ బతకాలి. గ్రామం నుంచి వారికి ఆహారం, మంచినీరు పంపించకపోవడం మరీ దారుణం. ఒకవేళ కుటుంబ సభ్యులు ఏదైనా ఆహారం తెచ్చినా, అపవిత్రం అవుతామనే భయంతో దూరంగా నేల మీద పడేసి వెళ్తారు తప్ప తాకరు. తాగేందుకు నీరు కావాలన్నా ఆ మహిళలు నడవలేని స్థితిలో కూడా మైళ్ళ దూరం నడిచి అడవిలోని వాగులు, చెలమల వద్దకు వెళ్ళాల్సి వస్తుంది.

33
అడవిలో అన్యాయంగా మరణిస్తున్నారు..

రక్షణ లేని ఆ గుడిసెల కారణంగా ఎంతోమంది మహిళలు విషసర్పాలు, తేళ్ళ కాట్లకు గురవుతున్నారు. అడవి జంతువుల దాడులు, సరైన పౌష్టికాహారం లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మానవ హక్కుల సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గ్రామ పెద్దల ఆంక్షలు, తరాల నాటి మూఢవిశ్వాసాలు ఆ మహిళలకు శాపంగా మారాయి. చదువుకున్న యూత్ ముందుకు వచ్చి ఇలాంటి అమానవీయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా గళమెత్తితేనే గిరిజన మహిళలకు నిజమైన విముక్తి, రక్షణ లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories