Hotel Secrets : హోటల్ రూమ్స్ కి మామూలు తాళాలు కాకుండా కీ కార్డ్స్ వాడతారు.. ఎందుకో తెలుసా?

Published : Aug 06, 2026, 05:37 PM IST

ఇప్పుడు ఏ హోటల్‌కు వెళ్లినా చెక్-ఇన్ అవ్వగానే చేతిలో ఓ ప్లాస్టిక్ కీ కార్డ్ పెడుతున్నారు. పాతకాలం నాటి ఇనుప తాళాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. అసలు హోటళ్లు ఈ కీ కార్డ్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం.

PREV
14
భద్రత కోసమే కీ కార్డ్స్..

సాధారణ తాళం చెవి పోతే, కొత్తది చేయించాలి లేదా తాళం మార్చాలి. కానీ కీ కార్డ్ పోతే, కొన్ని క్షణాల్లోనే దాన్ని డీయాక్టివేట్ చేసి కొత్త కార్డ్ ఇస్తారు. దీంతో వేరేవాళ్లు గదిలోకి వెళ్లే ప్రమాదం ఉండదు. మీరు చెక్-అవుట్ చేసిన వెంటనే ఆ కార్డ్ పనిచేయడం ఆగిపోతుంది. కాబట్టి పాత గెస్టులు మళ్లీ రూమ్‌లోకి రాలేరు.

24
ఒకే కార్డుతో ఎన్నో సౌకర్యాలు

ఈ రోజుల్లో చాలా హోటళ్లలో ఒకే కీ కార్డ్‌తో రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్కింగ్, లిఫ్ట్ వంటి వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఇది గెస్టులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

చాలా హోటళ్లలో రూమ్‌లోని కరెంట్ సిస్టమ్ ఈ కీ కార్డ్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. గెస్ట్ బయటకు వెళ్తూ కార్డ్ తీయగానే లైట్లు, ఏసీ వంటివి ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. దీనివల్ల కరెంట్ ఆదా అవుతుంది.

34
ప్రతీ యాక్సెస్ రికార్డ్ అవుతుంది

ఎవరు, ఏ సమయంలో గది తలుపు తెరిచారు అనే డిజిటల్ రికార్డ్ హోటల్ సిస్టమ్‌లో ఉంటుంది. ఏదైనా భద్రతా సమస్య వస్తే, ఈ సమాచారం విచారణకు బాగా ఉపయోగపడుతుంది.

44
హోటల్ నిర్వహణ సులభం

వేల గదులున్న హోటళ్లలో ఇనుప తాళాలను నిర్వహించడం చాలా కష్టం. అదే కీ కార్డ్‌ల ద్వారా అయితే కొత్త కార్డ్ ఇవ్వడం, యాక్సెస్ రద్దు చేయడం, గదులను మేనేజ్ చేయడం చాలా సులభం అవుతుంది. అందుకే పెద్దపెద్ద హోటల్స్ ఈ కీ కార్డ్స్ ని విరివిగా వాడుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories