River: నదిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని మనకు తెలుసు. కానీ, పుణ్యంతో పాటు బంగారం కూడా దొరికితే ఎలా ఉంటుంది? అన్ని నదుల్లో కాదు కానీ, ఈ నదిలో మాత్రం ఈజీగా బంగారం దొరుకుతుంది.
భారతదేశంలో నదులను మనం దేవతలుగా పూజిస్తాం. సాధారణంగా నదులు అనగానే మనకు నీరు, ఇసుక, చుట్టూ పచ్చని చెట్లే గుర్తుకు వస్తాయి. కానీ, జార్ఖండ్ లో ప్రవహించే ఓ నది మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ నీటిలో కాదు.. నదిలోని ఇసుకలో బంగారం దొరుకుతుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ నది విశేషాలు ఇప్పుడు చూద్దాం...
23
ఈ నది పేరు ఏంటి? ఈ పేరు ఎలా వచ్చింది..?
ఈ అద్భుతమైన నది పేరు స్వర్ణ రేఖ. స్వర్ణం అంటే బంగారం, రేఖ అంటే గీత లేదా ధార అని అర్థం. అంటే, ఈ పేరుకు తగ్గట్టుగానే ఇది ఇసుకలో బంగారు రేణువులు లభిస్తాయి. నదిలో బంగారం దొరుకుతుంది అంటే.. మొత్తం బంగారం ఉంటుందని కాదు. అలా అని పెద్ద పెద్ద బంగారు ముక్కలు దొరుకుతాయి అనుకుంటే కూడా పొరపాటే. నది ఇసుకలో అతి సూక్ష్మమైన పేపర్ గోల్డ్ రూపంలో బంగారు రేణువులు కనిపిస్తాయి. నది ప్రవాహం వల్ల బంగారం కలిగిన రాళ్లు కాలక్రమేనా అరిగిపోతూ ఉంటాయి. అలా విడిపోయిన భారమైన బంగారు కణాలు ఇసుక, మట్టితో కలిసి నది అడుగున పేరుకుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.
33
బంగారం కోసం వేట ఎలా సాగుతుంది..?
ఈ నది ఇసుకలో బంగారు కణాలు లభిస్తుండటంతో, స్థానికులు కొందరు సంప్రదాయ పద్ధతుల్లో ఇసుకను వడకట్టి ఈ చిన్న బంగారు రేణువులను వేరు చేసేవారు. కానీ, ఇక్కడ దొరికే బంగారంతో కోటీశ్వరులు అయిపోతాం అనుకుంటే పొరపాటే. అంత ఎక్కువ మొత్తంలో మాత్రం దొరకదు. కానీ, వెతికితే మాత్రం ఎంతో కొంత బంగారం మాత్రం ఈజీగా దొరుకుతుంది.
ఈ నదిలోకి బంగారం ఎలా వచ్చింది..?
జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ ప్రాంతం బంగారం ఖనిజీకరణకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని రాళ్లు సహజంగా అరిగిపోవడం వల్ల వాటిలోని బంగారు కణాలు నీటి ప్రవాహంతో కదిలి వచ్చి నది ఇసుకలో చేరుతుంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటిలో బంగారం పారడం కాకపోయినా.. ఇసుకలో సూక్ష్మ బంగారు రేణువులను మోసుకెళ్లే ఈ అద్భుత నది మన దేశంలోనే ఉండటం నిజంగా గ్రేట్ కదూ.