Andhra Paris: ఆ ఊరు మధ్యలోంచే ప్రవహించే భారీ మంచినీటి కాలువలు.. అందుకే ఆంధ్రా పారిస్‌ పేరు

Published : Nov 06, 2026, 10:16 AM IST

Andhra Paris: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఎన్నో పట్టణాలు ప్రత్యేకతను సాధించాయి. అలాంటి వాటిల్లో ఆంధ్రా పారిస్ గా పిలచుకునే ఊరు కూడా ఉంది. ఆ ఊరు వివరాలు తెలుసుకోండి.

PREV
13
ఆంధ్ర పారిస్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పట్టణానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్ పేరుతో పోలిక ఉంది. అదే తెనాలి పట్టణం. గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలి కళలు, సాహిత్యం, నాటక రంగానికి పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల జీవనశైలి, సాంస్కృతిక సంపద ఈ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు, తెనాలి అంటే వెంటనే గుర్తొచ్చే మరో పేరు వికటకవి తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామకృష్ణుడు ఒకరు. ఆయన పుట్టిన ప్రాంతంగా కూడా తెనాలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పట్టణం నేటికీ తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది.

23
ఆంధ్ర పారిస్ పేరు ఎందుకు వచ్చింది?

తెనాలికి ఆంధ్రా పారిస్ అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఇక్కడి కాలువలు. కృష్ణా నదికి చెందిన మూడు ప్రధాన కాలువలు ఈ పట్టణం గుండా ప్రవహిస్తాయి. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలోనూ కాలువలు ప్రవహిస్తుండటంతో ఈ రెండు ప్రాంతాల మధ్య పోలిక కనిపిస్తుంది. దీంతో తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని పిలవడం మొదలైంది. కాలువల వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అవసరమైన నీరు అందుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో వరి సాగు విస్తారంగా జరుగుతుంది. అందుకే తెనాలి ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని సారవంతమైన వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పచ్చని పొలాలు, నీటి కాలువలు ఈ ప్రాంతానికి అందాన్ని తీసుకొస్తాయి.

33
తెనాలి వెరీ స్పెషల్

తెనాలి పట్టణానికి సాంస్కృతికంగా కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ నాటకాలు, సంగీత కార్యక్రమాలు, సాహితీ సభలు విస్తారంగా జరిగేవి. ఎందరో కవులు, కళాకారులు, రచయితలు ఈ ప్రాంతానికి చెందినవారు. 1909లోనే తెనాలిలో మున్సిపాలిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి పట్టణం క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం విద్య, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో తెనాలి తనదైన గుర్తింపు సంపాదించింది. మూడు కాలువలు, పచ్చని ప్రకృతి, కళా సాహిత్య రంగాల్లో గొప్ప పేరు ఉండటంతో తెనాలికి ఆంధ్రా ప్యారిస్ అనే పేరు మరింత ప్రాచుర్యం పొందింది.

Read more Photos on
click me!

Recommended Stories