Sultan Goat : సాధారణంగా ఓ మేక ధర రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు ఉంటుంది. మహా అయితే రూ.50 వేలు ఉంటుంది. కానీ ఓ మేక ధర ఏకంగా రూ.8 లక్షలట. ఇంతకూ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగ బక్రీద్. త్యాగానికి ప్రతీకగా దీన్ని జరుపుకుంటారు కాబట్టి 'ఖుర్బానీ పండగ' లేదా 'ఈద్-ఉల్-అధా' అని కూడా పిలుచుకుంటారు. రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే అతిపెద్ద పండగ ఇది. దేశవ్యాప్తంగా ఇవాళ (మే 28, గురువారం) బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి.
బక్రీద్ పండగపూట మూగ జీవాలను మరీముఖ్యంగా మేక, గొర్రెలను బలి ఇవ్వడం ముస్లిం సాంప్రదాయంలో భాగం. అందుకే ఈ సమయంలో మేకలకు ఫుల్ గిరాకీ ఉంటుంది... ఇలాంటి టైంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణానికి చెందిన ఓ మేక సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. దాని పేరు 'సుల్తాన్'. పంజాబీ బీటల్ జాతికి చెందిన ఈ మేక బరువు ఏకంగా 200 కిలోలు. దీని యజమాని పేరు మొయీన్ ఖాన్.
24
ఏమిటీ ఈ 'సుల్తాన్' మేక ప్రత్యేకత..?
సుల్తాన్ అంటే మామూలు మేక కాదు. తాగడానికి పాలు, తినడానికి డ్రై ఫ్రూట్స్, ఉండటానికి ఏకంగా కూలర్.. ఇలా ఫుల్ లగ్జరీ లైఫ్ గడుపుతోంది. ఈ రేంజ్ లైఫ్‌స్టైల్ వల్లే సోషల్ మీడియాలో సుల్తాన్ తెగ వైరల్ అయ్యింది. సుల్తాన్‌తో పాటు 'గోలు లాలా' అనే మరో మేక కూడా తన రాయల్ లైఫ్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ బక్రీద్ సందర్భంగా ఈ రెండు మేకలను యజమానులు బలి ఇచ్చారు.
సుల్తాన్ పంజాబీ బీటల్ జాతికి చెందిన మేక. దీని బరువు 200 కిలోలకు పైనే ఉంటుంది. ఎత్తు దాదాపు 48 అంగుళాలు. ఇండోర్ లోని గుల్జార్ కాలనీకి చెందిన మొయీన్ ఖాన్ దీని యజమాని. ఏడాది క్రితం పంజాబ్ నుంచి దీన్ని తీసుకొచ్చినట్లు మొయీన్ ఖాన్ చెప్పారు. ఇందుకోసం రెండు రోజుల్లో 1000 కిలోమీటర్లు ప్రయాణించారట. సొంత మనిషిలా చూసుకుంటూ పెంచామని ఆయన అంటున్నారు.
ईद के मौके पर इंदौर में आया 8 लाख का बकरा#MPNews #indore #viralvideochallenge pic.twitter.com/2zwT8cgYyF
— टीटू भारद्वाज (@teetusharma6) May 27, 2026
34
సుల్తాన్ మెనూ ఇదే..
సుల్తాన్ రోజువారీ మెనూలో 2 లీటర్ల పాలు, 250 గ్రాముల డ్రై ఫ్రూట్స్, దాదాపు 10 కిలోల ఆకులు ఉంటాయి. ఎండ వేడి నుంచి కాపాడటానికి దీనికి ప్రత్యేకంగా కూలర్ కూడా ఉంది. తాగడానికి చల్లటి నీళ్లు, మజ్జిగ ఇస్తారు. సుల్తాన్‌కు సొంతంగా ఓ గది కూడా కేటాయించారు. ఫేమస్ అవ్వడంతో సుల్తాన్‌కు ఏకంగా 8 లక్షల రూపాయల ధర పలికింది. దీన్ని చూడటానికి జనం దూరం దూరం నుంచి వస్తున్నారని తెలుస్తోంది.
ఇక 'గోలు లాలా' అనే మరో మేక కూడా ఇండోర్ బక్రీద్ మార్కెట్‌లో తెగ ఫేమస్ అయింది. దీన్ని ఏడాది క్రితం కొన్నామని యజమాని ఫాతిమా చెప్పారు. దీన్ని కూడా కుటుంబ సభ్యుడిలాగే పెంచారట.
గోలు లాలకి పడుకోవడానికి సొంతంగా మంచం కూడా ఉంది. ఉదయాన్నే పార్లే-జి బిస్కెట్లు తింటుంది. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు తినే ఆహారంలో వాటా ఇస్తారు. బాదం, జీడిపప్పు, పాలు కూడా దీని మెనూలో ఉన్నాయి. ఎండకాలంలో వేడి తగలకుండా దీనికి కూడా స్పెషల్ కూలర్ ఏర్పాటు చేశారు.