Indian River: మనదేశంలో కంటికి కనిపించకుండా ప్రవహిస్తున్న ఒకే ఒక్క నది ఏది?

Published : Sep 23, 2026, 10:44 AM IST

Indian River: మనదేశంలో వందల నదులు ఉన్నాయి. వాటిలో ఒకే ఒక్క నది మాత్రం మన కంటికి కనిపించకుండా ప్రవహిస్తోంది. ఆ నది భూమి లోపల ఇప్పటికీ ప్రవహిస్తున్నట్టు శాటిలైట్ చిత్రాలు కూడా నిరూపించాయి. ఆ నదేంటో తెలుసా?

PREV
13
ఎవరూ చూడని నది?

ఎవరినైనా ప్రముఖ నదులు పేర్లు చెప్పమంటే.. గంగా, యమునా, సరస్వతి అని నదుల పేర్లు చెబుతారు. కానీ ఎవరైనా సరస్వతి నది చూశారా? అది ఎవరి కంటికి కనిపించదు. కానీ ప్రవహిస్తూనే ఉంది. కంటికి కనిపించకపోయినా భారతదేశ నదుల జాబితాలో సరస్వతి నది కూడా కౌంట్ అవుతుంది. సరస్వతి నది ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశంలో హిమాలయాల నుంచి ప్రారంభమై హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా ప్రవహించి కచ్ ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలిసేది. మన వేదాలలో ముఖ్యంగా ఋగ్వేదంలో ఈ నదిని ఒక మహా ప్రవాహంగా, అత్యంత పవిత్రమైన జీవనదిగా వర్ణించారు. వేద సంస్కృతి, సింధు సరస్వతి నాగరికత ఈ నదీ తీరంలోనే వర్ధిల్లాయని చరిత్రకారులు చెబుతారు. అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) లోని త్రివేణి సంగమంలో గంగ, యమునలతో పాటు సరస్వతి నది కూడా కలుస్తుందని భారతీయుల విశ్వాసం. అయితే పురాణాల ప్రకారం సరస్వతి పవిత్రతను కాపాడుకోవడానికి భూమి లోపల అంతర్వాహినిగా ప్రవహిస్తోందని, అందుకే బయటకు కనిపించదని చెబుతారు.

23
సరస్వతి నది ఎందుకు కనిపించదు?

సరస్వతి నది కంటికి కనిపించకుండా పోవడానికి ప్రధాన కారణం భూగర్భంలో చోటుచేసుకున్న పెను మార్పులే. దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో సంభవించిన భారీ భూకంపాల వల్ల భూమి పొరలు తీవ్రంగా కదిలాయి. ఆ సమయంలో సరస్వతి నదికి కొండల నుంచి నీటిని తెచ్చే ప్రధాన ఉపనదులైన యమున, సట్లెజ్ నదులు తమ మార్గాలను మార్చుకున్నాయి. యమునా నది తూర్పు దిక్కుకు మళ్లి గంగా నదిలో కలవగా, సట్లెజ్ నది పశ్చిమ వైపుకు తిరిగి సింధు నదితో చేరింది. ఫలితంగా సరస్వతి నదికి వచ్చే ప్రధాన హిమనీనద నీటి ప్రవాహం ఆగిపోయి ఆ నది నెమ్మదిగా ఎండిపోవడం ప్రారంభమైంది.

33
అంతర్వాహినిగా సరస్వతి

అదే సమయంలో సంభవించిన తీవ్ర వాతావరణ మార్పులు, వర్షపాతం తగ్గడం వల్ల సరస్వతి నది మరింత బలహీనపడింది. రాజస్థాన్ ప్రాంతంలో థార్ ఎడారి క్రమంగా విస్తరించడంతో, సరస్వతి ప్రవాహ మార్గం మొత్తం ఇసుక మేటల కిందకు చేరిపోయింది. ఇస్రో ఉపగ్రహ చిత్రాల పరిశోధనల ద్వారా భూమి లోపల సరస్వతి పాత మార్గాలు ఇప్పటికీ ఆనవాళ్లుగా మిగిలి ఉన్నాయని తేలింది. ప్రస్తుతం వర్షాకాలంలో మాత్రమే కనిపించే ఘగ్గర్-హక్రా నదీ మార్గమే ఒకనాటి ప్రాచీన సరస్వతి ప్రవాహమని పరిశోధకులు చెబుతున్నారు. అలా ప్రవాహ మార్గం మారడం, ఎడారి ఇసుకలో కూరుకుపోవడం వల్ల ఈ మహానది నేడు మన కంటికి నేరుగా కనిపించకుండా కేవలం భూగర్భ జల ప్రవాహంగా మాత్రమే మిగిలింది.

Read more Photos on
click me!

Recommended Stories