మీ పిల్లలు స్కూల్ లేదా కాలేజీలో చదువుతున్నారా? అయితే ప్రభుత్వం నుండి ఫ్రీగా రూ.125000 పొందండి

Published : Nov 21, 2026, 03:05 PM ISTUpdated : Nov 21, 2026, 03:17 PM IST

స్కూల్ లేదా కాలేజీలో చదువుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పీఎం యశస్వి స్కీమ్ ద్వారా రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల (నవంబర్) 30 లోపు అప్లై చేసుకోవచ్చు.

PREV
15
కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ స్కీమ్

పాఠశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పీఎం యశస్వి స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలిసిందే. చదువుకోవాలని ఆశ ఉన్నా ఆర్థిక సమస్యలతో చదువు మానేయాల్సిన పరిస్థితిలో ఉన్న విద్యార్థులకే ఈ స్కాలర్ షిప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. దేశంలోని ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EBC), డీనోటిఫైడ్ తెగలు (DNT) విద్యార్థులకు ఏడాదికి రూ.75,000 నుంచి రూ.1.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

స్కూల్లో 9, 10 తరగతులు లేదా ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది కేంద్రం. ఈ స్కాలర్ షిప్ పొందాాలంటే సదరు విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలన్నది ప్రధాన కండిషన్. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నవంబర్ 30 లోగా అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

25
పీఎం యశస్వి స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద అమలయ్యే పథకమే ఈ PM-YASASVI (Prime Minister Young Achievers Scholarship Award Scheme for Vibrant India). సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ చదువును ఆపేయకూడదన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అర్హులైన విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందేలా, చదువు ఖర్చుల భారాన్ని తగ్గించేలా ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పలు దశల్లో ఈ స్కీమ్ ద్వారా సాయం అందుతుంది.

ఏ తరగతి వారికి ఎంత వస్తుంది?

చదివే తరగతులను బట్టి స్కాలర్‌షిప్ అమౌంట్ మారుతుంది. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.75,000… 11, 12 తరగతుల అంటే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు గరిష్ఠంగా రూ.1,25,000 చొప్పున స్కాలర్‌షిప్ దక్కుతుంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు లాంటి ఖర్చుల కోసం ఈ డబ్బును ఇస్తారు. అయితే ఎలాంటి కండిషన్స్ లేకుండా మొత్తం డబ్బు నేరుగా అకౌంట్‌లో పడుతుందని అనుకోకూడదు. అర్హత, నిబంధనలను బట్టే డబ్బు మంజూరవుతుంది. విద్యార్థి తల్లిదండ్రులు లేదా సంరక్షుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.

35
ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?

ఈ స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులకు ఈ అర్హతలు ఉండాలి.

1. విద్యార్థి OBC, EBC లేదా DNT కేటగిరీకి చెందిన వారై ఉండాలి.

2. 2026-27 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతి చదువుతూ ఉండాలి.

3. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలి.

4. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో లిస్ట్ చేసిన అర్హత గల స్కూల్‌లో చదువుతూ ఉండాలి.

5. స్కూల్, విద్యార్థి వివరాలను అధికారులు వెరిఫై చేస్తారు.

అమ్మాయిలకు 30 శాతం రిజర్వేషన్

ఈ పథకంలో అమ్మాయిలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం స్కాలర్‌షిప్‌లలో 30 శాతం అమ్మాయిలకే కేటాయించారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల బాలికలు తమ చదువును ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు.

ముఖ్య గమనిక : 9 నుంచి 12వ తరగతి చదివే ప్రతి ఒక్కరికీ ఇది ఆటోమేటిక్‌గా రాదు. సరైన అర్హతలు ఉండి, గుర్తింపు పొందిన స్కూళ్లలో చదివే వారినే ఎంపిక చేస్తారు.

45
దరఖాస్తుకు ఏయే డాక్యుమెంట్లు కావాలి?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు ఈ కింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు.
  • కుల ధ్రువీకరణ పత్రం.
  • కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం.
  • విద్యార్థి బ్యాంకు ఖాతా వివరాలు.
  • మునుపటి తరగతి మార్కుల జాబితా.
  • స్కూల్ ఐడీ కార్డు లేదా అడ్మిషన్ వివరాలు.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ తదితర వివరాలు.

ఈ డాక్యుమెంట్ల జాబితా అధికారిక వెబ్‌సైట్ నిబంధనల ప్రకారం మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక మార్గదర్శకాలను ఒకసారి చెక్ చేసుకోవాలి.

ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొండి

గతంలో లబ్ధి పొందినవారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన https://scholarships.gov.in/ వెబ్ సైట్ లో రెన్యూవల్ చేసుకోవచ్చు. ఈసారి 9, 11 తరగతుల విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇదే వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి.

55
లాస్ట్ డేట్ ఎప్పుడు?

ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి నవంబర్ 30, 2026 చివరి తేదీ అని నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ తెలిపింది.

- విద్యార్థులు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ : 30.11.2026

- తప్పులు సరిచేసుకోవడానికి లాస్ట్ డేట్ : 15.12.2026

- స్కూల్స్ వెరిఫికేషన్‌కు లాస్ట్ డేట్ : 15.12.2026

- జిల్లా/రాష్ట్ర స్థాయి వెరిఫికేషన్ లాస్ట్ డేట్ : 31.12.2026

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పై చదువులకు ఖర్చులు పెరుగుతున్నందున ఈ స్కాలర్‌షిప్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్ ఈ పథకానికి అర్హత సాధించిందో లేదో ముందే చెక్ చేసుకోండి. చివరి నిమిషం వరకు ఆగకుండా త్వరగా అప్లై చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories