ఈ రొయ్య పంజా మూసుకునే వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, అక్కడ విడుదలయ్యే శబ్దం సుమారు 218 డెసిబల్స్ వరకు చేరుకుంటుంది . నీటిలో ఉత్పన్నమయ్యే ఈ తీవ్రమైన శబ్దం, దాంతో పాటు పుట్టే షాక్ వేవ్ (shock wave) వల్ల ఎదురుగా ఉన్న చిన్న చేపలు క్షణాల్లోనే మరణిస్తాయి.
ఆత్మరక్షణ, వేటలో ప్రత్యేకత
సముద్ర గర్భంలో నివసించే తమంచా రొయ్యలకు తమ కంటే పెద్ద జీవుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వేగంగా పారిపోవడం కంటే, తన పంజాలోని ప్రత్యేక శక్తితో శత్రువును నిలువరించడం దీని ప్రధాన వ్యూహం. వేటాడేటప్పుడు కూడా ఈ షాక్ వేవ్‌ను ఉపయోగించి ఎరను కదలకుండా చేసి సులభంగా పట్టుకుంటుంది .