ఉన్నత విద్యనభ్యసించాలని ఎంతోమంది యువత కలలు కంటారు. కానీ డబ్బులు లేక గ్రాడ్యుయేషన్ తోనే ఆపేస్తారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విద్యాలక్ష్మి స్కీంతో మీరు హయ్యర్ స్టడీస్ కోసం లోన్ తీసుకోవచ్చు.
పేదవారికి ఉన్నత విద్య అందాలన్నా ఆకాంక్షతో ఏర్పాటు చేసినదే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. దీన్నే పీఎం విద్యాలక్ష్మి స్కీం అని పిలుస్తారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు కేవలం ఆర్థిక పరిస్థితుల వల్ల ఆగిపోకుండా తమ ఉన్నత చదువులను కొనసాగించాలన్నదే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాల కు చెందిన విద్యార్థులకు ఫీజులు, హాస్టల్ రుసుములకు, రవాణాకు అవసరమైన ఖర్చులను భరించేందుకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.
25
పదిహేను రోజుల్లోనే రుణం
వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా స్కీమును ప్రవేశపెట్టండి. ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకుండా ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కానీ ఈ పథకం పట్ల సరైన అవగాహన ఎవరికి లేదు. అందుకే అర్హులైన విద్యార్థులు ఉన్నప్పటికీ ఈ పథకాన్ని వినియోగించలేకపోతున్నారు. లోన్ అంటే ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయేమో, ఏదైనా గ్యారెంటీ చూపించాలేమో అని పథకానికి దూరంగా ఉంటున్నారు. ఏ ఇల్లు, భూమి వంటివి గ్యారెంటీ పెట్టుకుని లోన్ ఇస్తారేమోనని భయపడుతున్నారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ విద్యాలక్ష్మి పథకానికి ఎటువంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకు గ్యారెంటీలు కూడా అవసరం లేకుండానే చాలా తక్కువ వడ్డీకే అందించే రుణ సదుపాయం ఇది. కేవలం మీకు యూనివర్సిటీ ఫీజులు కట్టడమే కాదు... మీ వసతికి, రవాణాకు, పుస్తకాలకు కావలసిన ఖర్చులను కూడా ఈ రుణంలోనే పొందవచ్చు. భారతదేశంలో, అలాగే విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారికి ఈ పథకం అప్పును అందిస్తుంది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రక్రియ మొదలవుతుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం 15 రోజుల్లోనే రుణం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
35
ఎంత వడ్డీ?
ఈ స్కీమ్ గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన లేదు. అందుకే దీన్ని ఉపయోగించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజనను 2024 నవంబర్లో ప్రారంభించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తులు లేకుండా విద్యా రుణాలను అందించాలన్నదే దీని ఉద్దేశం. వార్షిక కుటుంబాదాయం ఎనిమిది లక్షలు దాటకుండా ఉన్న విద్యార్థులకు 10 లక్షల లోనుపై కేవలం మూడు శాతం వడ్డీ రాయితీతో అప్పు అందిస్తారు. ఏడున్నర లక్షల రూపాయల వరకు ఉన్న బకాయిలకు డిఫాల్ట్ మొత్తంలో 75% క్రెడిట్ గ్యారెంటీ కూడా ఇస్తారు.
45
ఎవరు అర్హులు?
ఈ విద్యాలక్ష్మి పథకం కోసం 2024 నుండి 2031 వరకు 3,600 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారతదేశంలో ఉన్న 860 ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు ప్రవేశం పొందేందుకు ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
ఈ పథకానికి కొన్ని పత్రాలు అవసరం పడతాయి. పీఎం విద్యాలక్ష్మి పథకంలో అప్లై చేయాలంటే ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, అలాగే మీరు ప్రవేశం పొందే యూనివర్సిటీ అడ్మిషన్ వివరాలు, కొన్ని గుర్తింపు రుజువు పత్రాలు అవసరం పడుతుంది. వీటి ద్వారా మీరు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ లోకి వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే.
55
విదేశీ విద్య కోసం
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఈ పథకం ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దీనిని వాడిని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ స్కీమ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే వినియోగదారుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మీ పిల్లల చదువుల కోసం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఈ పీఎం విద్యాలక్ష్మి స్కీమును వినియోగించుకోండి.