Mutton : మంచి మటన్ కావాలా..? అయితే మేకను కొనేముందు ఈ 5 విషయాలు తప్పక చూడండి

Published : Nov 13, 2026, 02:23 PM IST

రుచికరమైన మాంసం కలిగిన మేకను ఎలా గుర్తించాలో చాలామందికి తెలియదు. కొన్ని లక్షణాలను బట్టి ఆ మేక మంచిదో కాదో గుర్తించవచ్చు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
13
మంచి మాంసం కలిగిన మేకల లక్షణాలివే..

Mutton : కార్తీకమాసం వచ్చింది... పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయ్యింది. మంచిరోజులు ఉండటంతో ఇతర శుభకార్యాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాంసానికి మంచి డిమాండ్ పెరిగింది... చికెన్, మటన్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా మేకలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

తెలంగాణలో మేక మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది... ఇక్కడ శుభకార్యాలకే కాదు అశుభ కార్యాలకు కూడా మాంసాహారంతో భోజనాలు పెడుతుంటారు. ఇక్కడ చాలామంది మటన్ ఇష్టంగా తింటారు... కానీ ఏ మేక మాంసం రుచిగా ఉంటుందో గుర్తుపట్టలేరు. ఇలాంటివారు ఇంట్లో ఏదైనా దావత్ జరిగితే మేకను కొనేందుకు ఇతరులపై ఆదారపడాల్సి వస్తుంది... దీంతో ఎక్కువగా మోసాలకు గురవుతుంటారు. ముదిరిన మేకలను వీరికి అటగట్టి చేతులు దులుపుకుంటారు దళారులు... దీంతో రుచిపచి లేని మాంసంతో దావత్ చేయాల్సి వస్తుంది. ఇలా మోసపోకుండా మంచి మటన్ కోసం ఎలాంటి మేకను సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

23
మంచి మేకను ఎలా గుర్తించాలి?

ఏదైనా దావత్ కోసం యాట కోస్తుంటే మంచి మేకను సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మటన్ లేతగా, రుచికరంగా ఉండాలంటే ఈ ఐదు విషయాలను పరిశీలించి మేకను ఎంపిక చేసుకొండి.

కళ్లు, ముక్కు పరిశీలించండి

మేకను కొనడానికి మీరు సంతకు లేదా రైతు దగ్గరకు వెళ్ళగానే మందలుగా కనిపిస్తాయి. వాటిలో ఏది మంచిది, దేని మాంసం రుచిగా ఉంటుందో కనుక్కోడానికి ముందుగా వాటి ముఖాన్ని పరిశీలించండి. ఏ మేక కళ్ళు ప్రకాశవంతంగా మెరుస్తూ పరిశుభ్రంగా ఉన్నాయో చూడండి. అలాగే వాటి ముక్కునుండి ఎలాంటి ద్రవాలు కారకూడదు. ఇలా కళ్ళు, ముక్కు శుభ్రంగా ఉండేవాాటిని ఎంపిక చేసుకోవచ్చు.

చురుగుదనాన్ని పరిశీలించండి

మందలో ఓ మూలన కూర్చుని మనం తడితేగానీ లేవలేని మేకల జోలికి వెళ్లకండి. నీరసంగా ఉండేవాటిని కాకుండా మందలో చురుగ్గా గెంతుతూ ఉండే మేకను ఎంపిక చేసుకొండి. ఒకేచోట తల దించుకుని ఉండే మేకలను కూడా కొనవద్దు. మేతను ఆసక్తిగా తింటుంటే అది మంచి మేక అన్నట్లు.

33
చర్మం, వెంట్రుకలు పరిశీలించండి

మేకను కొనేముందు దాని శరీరాన్ని ఓసారి పరిశీలించండి... పట్టుకుని పైకెత్తి చూడండి. చర్మం నునువుగా, వెంట్రుకలు మెరుస్తూ ఉండాలి... వీటిని కొనడం మంచిది.

చర్మంపై ఏవైనా గాయాలు, పేలు, గోమార్లు వంటివి ఉండటం, వెంట్రుకలు రాలుతుండటం అనారోగ్య లక్షణాలను సూచిస్తాయి. ఇలాంటివాటిని సెలెక్ట్ చేయకండి. చూడటానికి శుభ్రంగా ఉండేవాటి మాంసం రుచిగా ఉంటుంది.

విసర్జకాలు గమనించండి

మేక విసర్జనను బట్టి కూడా అవి అరోగ్యంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వాటి విసర్జక పదార్థం గుండ్రంగా, గట్టిగా ఉండాలి.. పల్చగా ఉంటే ఏదో సమస్య ఉన్నట్లే. తోక కిందభాగంలో విరేచనాలు అయినట్లు తడిగా ఉండకూడదు.

నోట్లో పళ్లను పరిశీలించండి

మేక వయసును దాని పళ్లను చూసి గుర్తించవచ్చు. మేక కింది దవడపై రెండు పళ్లు ఉన్నాయంటే అది సంవత్సరం వయసున్నదని అర్థం. నాలుగు పళ్ళు ఉంటే 2 ఏళ్లు, 8 పళ్లు ఉంటే 3 నుండి 4 ఏళ్ళ వయసు ఉన్నట్లు. ఇలాంటి మేకలను కొనవచ్చు. ఒకవేళ పళ్ల మధ్య ఖాళీ ఉండటం, అవి అరిగిపోయి ఉంటే అది ముసలి మేక అన్నట్లు.. వీటిని కొనవద్దు.

Read more Photos on
click me!

Recommended Stories