బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో భాగంగా 74వ రోజు డిక్టేటర్స్ గేమ్స్ కొనసాగాయి. ఇందులో త్రిగున్ టీమ్ డామినేషన్ కనిపించింది. ఓ గేమ్ లో వంశీ, ఆర్కే తీవ్రంగా శ్రమించినప్పటికీ బిగ్ బాస్ దానిని రద్దు చేశారు.
బిగ్ బాస్ హౌస్ లో 74వ రోజు ఇద్దరు డిక్టేటర్స్ త్రిగుణ్, ముకేశ్ టీమ్స్ మధ్య ఆసక్తికర పోటీ జరిగింది. ఈ పోటీలో త్రిగున్ టీం పైచేయి సాధించింది. ముందుగా జరిగిన ఒక పోటీలో త్రిగుణ్ టీమ్ నుంచి వంశీ.. ముకేశ్ టీమ్ నుంచి ఆర్కే పాల్గొన్నారు. ఈ టాస్క్ కి వర్షిణి, శివ సంచాలకులుగా వ్యవహరించారు.
24
గేమ్ రద్దు
గేమ్ పూర్తయ్యాక ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. డిక్టేటర్స్ మధ్య కూడానా ఏకాభిప్రాయం కుదర్లేదు. దీనితో బిగ్ బాస్ ఆ గేమ్ నే రద్దు చేశారు. దీనితో ఆర్కే, వంశీ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయినట్లు అయింది. బిగ్ బాస్ చెప్పినదాని ప్రకారం ముకేశ్ తన టీమ్ లో స్ట్రాంగ్ ఎవరు, వీక్ ఎవరు అనేది తేల్చి చెప్పారు. తన టీమ్ లో రామ్ ప్రసాద్ వీకెస్ట్ అని, నరేష్ వీక్ అని, వర్షిణి స్ట్రాంగ్ అని, అమన్ స్ట్రాంగెస్ట్ అని ముకేశ్ ప్రకటించాడు.
34
వర్షిణి అంత స్ట్రాంగ్ ఎలా అయింది ?
త్రిగుణ్ తన టీమ్ లో శివ స్ట్రాంగెస్ట్ అని, దేబ్జానీ స్ట్రాంగ్ అని, నీతూ వీక్ అని, వంశీ వీకేస్ట్ అని పేర్కొన్నాడు. అప్పటికే త్రిగుణ్ టీమ్ ముందంజలో ఉండడంతో అతడికి బిగ్ బాస్ ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. తన టీమ్ లోని ఒకరిని ముకేశ్ టీమ్ లోకి పంపి అందులో ఉన్న ఎవరినైనా తన టీమ్ లోకి తీసుకోవచ్చు అని తెలిపారు. దీనితో త్రిగుణ్ నీతూని అటువైపు పంపి అమన్ ని తన టీమ్ లోకి తీసుకున్నాడు. ఇంతలో నరేష్.. రామ్ ప్రసాద్, దేబ్జానీ లాంటి వాళ్ళతో మాట్లాడుతూ వర్షిణి స్ట్రాంగ్ ప్లేయర్ అని ముకేశ్ చెప్పాడు. ఇంత సడెన్ గా వర్షిణి స్ట్రాంగ్ ఎలా అయింది అబ్బా అంటూ నరేష్ సెటైరికల్ గా డౌట్ అడిగాడు. దీనితో అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వారు.
ఆ తర్వాత జరిగిన టాస్క్ లో త్రిగుణ్ టీమ్ నుంచి అమన్, దేబ్జానీ.. ముకేశ్ టీమ్ నుంచి వర్షిణి, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ టాస్క్ లో త్రిగున్ టీమ్ విజయం సాధించింది.