Published : Dec 03, 2025, 01:10 PM ISTUpdated : Dec 03, 2025, 01:11 PM IST
Motivational story: జీవితంలో మనల్ని కొందరు కావాలని రెచ్చగొడుతుంటారు. అయితే ఇలాంటి వాటికి స్పందించి అనవసరంగా స్పందిస్తే ఇబ్బందులు తప్పవని చాటి చెప్పే ఒక మంచి మోటివేషనల్ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనగనగా ఒక రోజు అడవిలో ఓ పాము నెమ్మదిగా ముందుకు వెళ్తుంటుంది. దారి మధ్యలో ఆకుల పొదల్లో ఉన్న ఓ రంపం పాము నడుముపై గుచ్చుకుంటుంది. గాయం చిన్నదే అయినా, అది పాములో తీవ్ర ఆగ్రహం రగిలిస్తుంది. నన్నే గాయ పెడతావా.? అని కోపంతో ఊగిపోతుంది.
25
ప్రతీకారం మొదలైన క్షణం
గాయానికి కారణం రంపమే అనుకుని పాము దాని మీద పడుతుంది. కోరలతో బలంగా కాటేస్తుంది. ఆ రంపం ఇనుపంలా గట్టిగా ఉండటంతో పళ్లే విరిగిపోతాయి. నొప్పి మరింత పెరిగినా, కోపం తగ్గదు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న తపన పాములో కనిపిస్తుంది.
35
కోపం ఆలోచనను మింగేసిన సమయం
పాము పళ్ల బలంతో సాధ్యం కాదని గ్రహిస్తుంది. ఇక శరీరంతో రంపాన్ని నలిపేయాలని చూట్టుతుంది. రంపం పదునుగా ఉండడంతో పాము శరీరాన్ని కోసేస్తుంది. కానీ కోపంతో ఉన్న పాము ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటుంది. ఎలాగైనా రంపాన్ని ఓడించాలన్న కసితో ఉంటుంది.
చివరికి రంపం ఏమాత్రం దెబ్బతినదు. కానీ పాము మాత్రం శరీరంతా కోసుకుపోయి కింద పడిపోతుంది. ప్రతీకారం కోసం పెట్టిన శక్తి ఆ రంపాన్ని ఏం చేయలేదు. కానీ పాము చనిపోతుంది. నష్టం రంపానికి కాదు, పాముకు మాత్రమే జరుగుతుంది.
55
గొప్ప సందేశం
మన జీవితంలో కూడా కొంతమంది కావాలని మాటలతో ప్రేరేపిస్తారు. చిన్న సంఘటనను పెద్ద సమస్యలా చూపించి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ రెచ్చిపోయి కోపంతో వ్యవహరిస్తే.. నిర్ణయాలు తప్పుతాయి. ఆలోచన కోల్పోతారు. నష్టం కూడా మనకే జరుగుతుంది. అందుకే.. ఎవరైనా రెచ్చగొట్టినా, స్వభావం కోల్పోకూడదు. ప్రతిస్పందించేముందు క్షణం ఆగి ఆలోచించాలి. ఆ క్షణమే మన జీవితాన్ని కాపాడగలదు అనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది.