సాధారణంగా కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దు అని పెద్దలు చెబుతుంటారు. అయితే జీవితంలో విజయం సాధించాలంటే మాత్రం కొమ్మను నరుక్కోవాల్సిందే అని చెప్పే ఒక మంచి నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనగనగ ఒక రాజు ఓ రోజు వేటకు అడవికి వెళ్తాడు. వేటలో ఉండగా అతనికి ఒక అందమైన చిలుక కనిపిస్తుంది. ఆ చిలుక ఎంతో యాక్టివ్‌గా ఎగురుతూ ఉండటంతో రాజు దానిని చూసి మంత్రముగ్ధుడవుతాడు. ఇంత అందమైన చిలుక నా కోటలో ఉంటే ఎంతో బాగుటుందని ఆశపడి వెంటనే దానిని బంధించి అంతపురానికి తీసుకువెళ్తాడు.
25
రాజమహల్‌లో చిలుకకు రాచ మర్యాదలు
రాజమహల్‌లో చిలుకను బంగారు పంజరంలో ఉంచి జీడిపప్పు, బాదంపప్పు, పండ్లు వంటి రుచికరమైన ఆహారం ఇస్తాడు. చిలుకకు కావాల్సిన అన్నీ సౌకర్యాలు కాళ్లదగ్గరే లభించేవి. ఇలా కొన్ని రోజులు గడిచాక రాజు చిలుక గాల్లో ఎగరడాన్ని చూడాలని అనుకుంటాడు.
35
ఎగరడం మర్చిపోయిన చిలుక
ఇందులో భాగంగానే అక్కడే ఉన్న కొంతమందికి చిలుకను పంజారం నుంచి బయటకు తీయమని చెబుతాడు. వెంటనే సైనికులు చిలుకను బయటకు తీసి చెట్టు కొమ్మపై కూర్చొబెడతారు. అయితే చిలుక మాత్రం కదలకుండా ఉండిపోతుంది.
సైనికులందరూ చప్పట్లు కొడుతూ దాన్ని ఎగరమని ప్రోత్సహిస్తారు. కానీ చిలుక మాత్రం కదలదు. ఎందుకంటే అది ఇప్పటికే సౌకర్యాల మధ్య జీవించడం అలవాటు చేసుకుంది. అడవిలో ఉండే స్వేచ్ఛ, జీవన పోరాటం అన్నీ మరిచిపోయింది.
దీంతో రాజు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ చిలుకను ఎవరైతే ఎగిరేలా చేస్తారో వారికి బహుమతి ఇస్తానని ప్రకటిస్తారు. అయితే చిలుకను ఎగరించే పనిలో చాలామంది విఫలమవుతారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఓ రైతు వేరే పద్ధతిని ఆలోచిస్తాడు. చిలుక కూర్చున్న కొమ్మను గొడ్డలితో నరికి వేస్తాడు. ఒక్కసారిగా చిలుక భయంతో రెక్కలు చాచుకొని ఎగురుతుంది. కొద్ది సేపటికి అది మళ్లీ మునుపటిలాగే ఆకాశంలో విహరించడం మొదలు పెడుతుంది.
55
కథ చిన్నదే నీతి గొప్పది
ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కంఫర్ట్ జోన్‌లో ఎక్కువ కాలం ఉంటే మన సామర్థ్యాలు, నైపుణ్యాలు మసకబారిపోతాయి. కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మన అసలు శక్తి బయటపడుతుంది. చిలుక ఎగరడానికి కొమ్మ నరికినట్టు, మన జీవితంలోనూ కొన్ని సార్లు కంఫర్ట్ జోన్‌ను విడిచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే నిజమైన విజయం సాధించవచ్చు.