Cleanest Village: చుట్టూ ఎక్కడ చూసినా పచ్చదనంతో తప్ప.. ఎలాంటి చెత్త లేకుండా, పరిశుభ్రంగా ఉండే గ్రామం చూడాలని ఉందా? అయితే.. మన దేశంలోనే అత్యంత శుభ్రమైన గ్రామానికి వెళ్లాల్సిందే.
మన దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత...స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇప్పటికీ, స్వచ్ఛ భారత్ పేరిట ప్రతి సంవత్సరం ఏవేవో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అయితే.. ఎన్ని చేసినా కూడా.. చాలా ప్రాంతాలు ఎప్పుడూ చెత్తతోనే నిండి ఉంటాయి. సిటీలు, పట్టణాలే కాదు.. స్వచ్ఛతకు మారుపేరు అయిన గ్రామాల్లో కూడా కనీసం శుభ్రత ఉండటం లేదు. ఇలాంటి రోజుల్లో మన దేశంలో ఒక అత్యంత శుభ్రత కలిగిన గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ గ్రామంలో మీకు చుట్టూ ఎటుపక్క చూసినా పచ్చని చెట్లు, అందమైన జలపాతాలు తప్ప.. చిన్న చిత్తు కాగితం కూడా కనిపించదు. ఆ గ్రామం ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం...
23
ఈ గ్రామం ఎక్కడ ఉంది..?
మేఘాలయా లోని తూర్పు ఖాసీ హిల్స్ ఉంది ఈ మావిల్లాంగ్ గ్రామం. ఈ ఊరినే మన దేశంలోనే కాదు.. ఏకంగా ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా గుర్తించారు. ఈ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా కూడా గుర్తించారు. ప్రతిరోజూ వేల మంది ఈ గ్రామాన్ని సందర్శించడానికి వెళుతూ ఉంటారు. ఎంత మంది పర్యాటకులు వచ్చినా కూడా.. ఈ గ్రామం ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుంది. దాని వెనక గ్రామస్తుల కష్టం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు.. తమ ఊరిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటారు. సహజంగా.. పర్యాటక ప్రదేశానికి ఎక్కువ మంది.. పర్యాటకలు వస్తే.. ఆ ప్రదేశాన్ని చెత్తతో నింపేస్తారు. కానీ.. ఈ గ్రామంలో మాత్రం అలా జరగదు. ఒకవేళ విజిటర్స్ వచ్చి చెత్త పడేసినా.. దానిని ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. గ్రామస్థులే.. దానిని శుభ్రం చేసేస్తారు. అందుకే... దీనికి అత్యంత శుభ్రమైన గ్రామంగా గుర్తింపు వచ్చింది.
33
ఆదివారం ఈ గ్రామంలో ప్రవేశం లేదు...
చుట్టు పక్కల గ్రామాలు, సిటీల నుంచి ఈ మావిల్లాంగ్ గ్రామానికి ఎప్పుడూ పర్యాటకులు వస్తూనే ఉంటారు. కానీ.. ఆదివారం మాత్రం ఈ గ్రామంలో ప్రవేశం ఉండదు. ఆల్రెడీ పర్యాటకులు వచ్చి అక్కడ స్టే చేస్తున్నట్లయితే సమస్య లేదు కానీ.. ఆదివారం మాత్రమే.. ఆ గ్రామాన్ని చూడటానికి ఎవరైనా వస్తే.. వెనుదిరిగి వెళ్లిపోవాల్సిందే. సహజంగా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి ఎవరైనా హాలీడే రోజు ముఖ్యంగా ఆదివారం రోజు వెళ్లాలని అనుకుంటారు. అయితే.. గ్రామస్తులు మాత్రం.. టూరిస్టులు తమ విలేజ్ కి సండే రోజు రాకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇలా వారు నిర్ణయం తీసుకోవడం వెనక కారణం కూడా ఉంది. పర్యాటకులు ప్రతిరోజూ రావడం వల్ల.. గ్రామస్తులకు ఒక్క రోజు కూడా వారి పనులు వారు ప్రశాంతంగా చేసుకోవడానికి కుదరడం లేదని.. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే అవకాశం కూడా రావట్లేదని భావించారు. అందుకే.. ఆ రోజు మాత్రం ఎవరికీ ప్రవేశం ఉండదు.
ఈ గ్రామ ప్రత్యేకత..
ఈ గ్రామం కేవలం శుభ్రంగా ఉండటమే కాదు.. వీలైనంత వరకు ఇక్కడ ప్లాస్టిక్ ఉపయోగించరు. పర్యావరణాన్ని కాపాడే పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువగా వెదురుతో చేసిన వస్తువులనే వాడతారు. కేవలం శుభ్రంగా ఉండటమే కాదు.. ఈ గ్రామం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వెళితే.. ప్రకృతి అందాలను పూర్తిగా ఆస్వాదించొచ్చు.