Milk: ఆ దేశంలో లీటర్ పాలు రూ. 400.. ఎందుకంత ఖరీదు? ఆ పాలల్లో స్పెషాలిటీ ఏంటి?

Published : Nov 05, 2026, 10:59 AM IST

Milk: మన దేశంలో లీటరు పాలు రూ.50 నుంచి రూ.80 మధ్య లభిస్తుంటే, ఒక దేశంలో మాత్రం పాల ధర 400 రూపాయలు ఉంది. మన పాలకు వారి పాలకు తేడా ఏంటి? అక్కడ మాత్రమే ఆరేటు ఎందుకు? ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా? అక్కడ పాడి రైతులు చేస్తున్న అద్భుతాలేంటి?

PREV
13
తైవాన్ గ్రామీణ జీవితం ‌- పాల వ్యాపారం

లీటర్ పాలు 400కు దొరికే దేశం మరేదో కాదు తైవాన్. ఆ దేశంలోని చాంగ్హువా (Changhua) సిటీ దాని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయంలో రైతులు అద్భుతాలు చేస్తుంటారు.

తైవాన్ తూర్పు ఆసియాలో ఉన్న ఒక ద్వీప దేశం. వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ముఖ్యంగా పాడి పరిశ్రమలో నాణ్యతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ పాలను ఉత్పత్తి చేయడం దగ్గర నుంచి వినియోగదారులకు చేరవేసే వరకు అనేక నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారు.

తైవాన్‌లో పచ్చిపాలను నాణ్యత ఆధారంగా ఏ, బీ, సీ, డీ అనే నాలుగు గ్రేడ్లుగా విభజిస్తారు. ముఖ్యంగా ఏ గ్రేడ్ పాలను మాత్రమే స్థానిక పాల ఉత్పత్తిదారులు తాజా పాల ఉత్పత్తులకు వినియోగిస్తారు. పాలలో బ్యాక్టీరియా స్థాయులు, సోమాటిక్ సెల్ కౌంట్ వంటి అంశాలను పరిశీలిస్తారు. తైవాన్‌లోని పల్లెటూర్లు మన దేశంలా కాకుండా అత్యంత అభివృద్ధి చెంది కనిపిస్తాయి. ఇక్కడ రైతులు తమ పొలాల్లో అత్యాధునిక టెక్నాలజీని, మెకానిజమ్స్ ఉపయోగిస్తారు.

భూమి దున్నడానికి, గడ్డి కట్ చేయడానికి ఆధునిక ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయి. పొలాల్లో నీటి సరఫరా కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కాలువలు ఏర్పాటు చేసింది. ఎవరి పొలం హద్దులు వారికి స్పష్టంగా ఉండేలా కాంక్రీట్ లైనింగ్స్ వేసుకుంటారు, దీనివల్ల గొడవలకు తావు ఉండదు. ఇక్కడ రైతులు ఉల్లిపాయలు, బ్రోకలీ, బఠానీలు, క్యాబేజీ, మొక్కజొన్న , జామకాయలు వంటి పంటలను విరివిగా పండిస్తున్నారు.

23
డైరీ ఫార్మ్ ప్రత్యేకతలు

ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనవి అక్కడి డైరీ ఫార్మ్స్ .. పాల ధర. తైవాన్‌లో ఆవులను ఇళ్ల వద్ద కాకుండా ప్రత్యేకమైన పెద్ద ఫార్మ్‌లలో పద్ధతిగా పెంచుతారు. ఈ డైరీ ఫార్మ్‌లలో ఆవులు రోజూ దాదాపు 10 నుండి 15 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఆవులకు పెట్టే గడ్డిని క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచుతారు. అక్కడ ఎవరి పర్యవేక్షణ ఉండదు.. ఎవరైనా వచ్చి గడ్డిని ఆవులకు వేసి, డబ్బాలో డబ్బులు వేసి వెళ్లవచ్చు. ఫార్మ్ నిర్వహణ, ప్రాసెసింగ్ అంతా పూర్తి అయ్యాక, డైరీ నిర్వాహకులు ఒక షాప్ లాగా ఏర్పాటు చేసి పాలు అమ్ముతారు. ఇక్కడ ఒక లీటర్ పాలు ఇండియన్ కరెన్సీలో దాదాపు 400 వరకు పలుకుతాయి.

పాల ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం?

ఇక్కడ పాల ధరలు ఎక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణమేంటంటే.? తైవాన్‌లో పశువుల పెంపకానికి అవసరమైన మేతలో కొంత భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. పశువుల నిర్వహణ, ఉత్పత్తి వ్యయం, పాల శుద్ధి, ప్యాకేజింగ్, రవాణా, సూపర్ మార్కెట్ల నిర్వహణ ఖర్చులు కూడా పాల ధరపై ప్రభావం చూపుతున్నాయి. తైవాన్‌లో పాడి రైతులు పశువుల ఆరోగ్యం, పాల నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

పాలు సేకరించిన తరువాత ప్రత్యేక వాహనాల్లో శీతలీకరణ సదుపాయాలతో ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తరువాత ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు పంపిస్తారు.స్థానికంగా ఉత్పత్తి చేసిన తాజా పాలకు అక్కడి వినియోగదారుల్లో మంచి ఆదరణ ఉంది. నాణ్యత, ఉత్పత్తి ప్రాంతం, పశువుల పెంపకం విధానాల గురించి తెలుసుకుని పాలు కొనుగోలు చేసే వినియోగదారులు కూడా ఉన్నారు.

33
చాలా ప్రత్యేకతలు ఉన్నాయి..

తైవాన్‌లో పాలు మాత్రమే కాదు.. ఇంకా చాలాప్రత్యేకతలు ఉన్నాయి. టీచింగ్ రంగంలో రాణించాలనుకునే వాళ్ల కోసం నేషనల్ చాంగ్హువా యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంతో పేరుగాంచింది. విదేశీ విద్యార్థులకు మాస్టర్స్ , పీహెచ్‌డీ చేయడానికి ఫుల్లీ ఫ్రీ ఫండెడ్ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. సిటీ మధ్యలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఉన్న భారీ బుద్ధుడి విగ్రహం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే ట్రైన్ ఇంజిన్లు మార్చడానికి , రిపేర్ చేయడానికి ఉపయోగించే రౌండ్ హైడ్రాలిక్ టర్నింగ్ షెడ్ ఇక్కడ మరొక విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories