ఇండియాలోనే రిచ్ హీరోయిన్, 4వేల కోట్లకుపైగా సంపాదించిన నటి ఎవరో తెలుసా?

Published : Oct 25, 2026, 03:31 PM IST

ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న నటి, 4000 కోట్లకు పైగా ఆస్తి, రకరకాల బిజినెస్ లు, స్టార్ హీరోలను మించి సంపాదిస్తున్న తార ఎవరో తెలుసా?

PREV
13
దేశంలోనే రిచ్ హీరోయిన్ గా పేరు..

ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అల్లరి చూపులు, అద్భుతమైన అభినయంతో కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన నటి జూహీ చావ్లా (Juhi Chawla) నేడు కేవలం నటిగానే కాకుండా, దేశంలోనే అత్యధిక ఆస్తులున్న అత్యంత సంపన్న నటిగా అగ్రస్థానంలో నిలిచారు. ఆమె సంపద దాదాపు రూ. 4,600 కోట్లకు పైగానే ఉండటం విశేషం. ఒక సాధారణ మోడల్ నుంచి దేశంలోనే అత్యధిక నికర విలువ కలిగిన స్టార్గా ఆమె ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

జూహీ చావ్లా ఆస్తులు ఎన్ని కోట్లు..

1984లో మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్న జూహీ చావ్లా, ఆ తర్వాత కొద్దికాలానికే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1986లో విడుదలైన 'సుల్తానత్' సినిమాతో ఆమె పెద్ద తెరపై అరంగేట్రం చేసినప్పటికీ, 1988లో అమీర్ ఖాన్ సరసన నటించిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రం ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చివేసింది. ఈ రొమాంటిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు, జూహీకి బాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'డర్', 'ఇష్క్', 'యెస్ బాస్', 'హమ్ హై రాహీ ప్యార్ కే' వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఆమె తిరుగులేని టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు.

23
తెలుగులో కూడా సత్తా చాటిన నటి..

కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా, జూహీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలోనూ తన మార్క్ చూపించారు. తెలుగులో నాగార్జున సరసన 'విక్కీ దాదా', 'కలియుగ కర్ణుడు' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. కాలక్రమేణా మారుతున్న కాలానికి తగినట్టుగా హీరోయిన్ రోల్స్ నుంచి వైవిధ్యమైన క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లారు. 'ఝంకార్ బీట్స్', 'మై బ్రదర్ నిఖిల్', 'గులాబ్ గ్యాంగ్' వంటి చిత్రాలలో ఆమె చేసిన పాత్రలు అద్భుతాలు చేశాయి.

33
వ్యాపార రంగంలో రాణించిన తార..

అయితే, సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కంటే వ్యాపార రంగంలో ఆమె చేసిన తెలివైన పెట్టుబడులే ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. ప్రముఖ వ్యాపారవేత్త జై మెహతాను వివాహం చేసుకున్న తర్వాత జూహీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ అయిన 'కోల్‌కతా నైట్ రైడర్స్' (KKR) జట్టులో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఆమె సహ-యజమానిగా వ్యవహరిస్తున్నారు. కేకేఆర్ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరగడం ఆమె సంపద ఒక్కసారిగా భారీగా పెరిగేందుకు ప్రధాన కారణమైంది.

దీనితో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు , వివిధ పారిశ్రామిక రంగాలలో ఆమె చేసిన భారీ పెట్టుబడులు ఆమెను నేడు బాలీవుడ్ లోని అగ్ర హీరోలను సైతం సంపదలో వెనక్కి నెట్టేలా చేశాయి. వెండితెరపై నవ్వుల రాణిగా అలరించిన జూహీ చావ్లా, నిజ జీవితంలోనూ తన వ్యాపార నైపుణ్యంతో ఒక పారిశ్రామికవేత్తగా విజయవంతమయ్యారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, తన టాలెంట్ తో భారతదేశంలోనే నంబర్ వన్ రిచ్ యాక్ట్రెస్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు.

Read more Photos on
click me!

Recommended Stories