ఏ రంగు డ్రెస్‌కు ఏది సెట్ అవుతుంది? ఈ 5 ఏఐ టూల్స్ వాడితే మీరే ఫ్యాషన్ ఐకాన్ !

Published : Apr 16, 2026, 06:41 PM IST

Perfect Outfit Colors : ఏ డ్రెస్‌పైకి ఏ రంగు సెట్ అవుతుందో అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇక ఆ చింత వద్దు.. మీ పర్సనల్ స్టైలిస్ట్‌లా మారి, మీకు సెట్ అయ్యే బెస్ట్ కలర్ కాంబినేషన్లను చిటికెలో సూచించే అద్భుతమైన ఏఐ టూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

PREV
16
స్టైలిష్‌గా కనిపించాలా? ఫ్యాషన్ డిజైనర్లు వాడే సీక్రెట్ ఏఐ టూల్స్ ఇవే

ఫ్యాషన్ ప్రపంచంలో కలర్ మ్యాచింగ్ అనేది ఒక సాధారణ డ్రెస్‌ను కూడా అద్భుతంగా మార్చగలదు. అయితే, ఏ రంగుకు ఏది సెట్ అవుతుందో అని ఆలోచించడం చాలా మందికి పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఆ కష్టాలను ఏఐ తీర్చేస్తోంది. ట్రెండ్స్, మూడ్స్, మన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా ఖచ్చితమైన కలర్ కాంబినేషన్లను ఈ ఏఐ టూల్స్ అందిస్తున్నాయి. మిషన్ లెర్నింగ్, బిగ్ కలర్ లైబ్రరీలను ఉపయోగించి, ఇవి మన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కొత్త ఐడియాలను ఇస్తున్నాయి. పాంటోన్ నుండి క్రోమా వరకు అందుబాటులో ఉన్న అద్భుతమైన ఏఐ టూల్స్ వివరాలు గమనిస్తే..

26
పాంటోన్ ప్యాలెట్ జనరేటర్.. ట్రెండ్‌కు తగ్గట్టుగా..

2025లో 'పాంటోన్ కనెక్ట్'లో బీటా ఫీచర్‌గా పరిచయమైన 'పాంటోన్ ప్యాలెట్ జనరేటర్' ఫ్యాషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇది మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్ ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. పాంటోన్ సంస్థకు ఉన్న 60 ఏళ్ల రంగుల పరిశోధనను ఇది ఉపయోగిస్తుంది. మీరు కేవలం నాకు ఉత్సాహాన్ని ఇచ్చే రంగులు చూపించు అని అడిగితే చాలు, అది వెంటనే ఒక కలర్ ప్యాలెట్‌ను సిద్ధం చేస్తుంది. 2026 నాటి 'పాంటోన్ కలర్ ఆఫ్ ది ఇయర్' వంటి లేటెస్ట్ ట్రెండ్స్‌ను కూడా ఇది ఫాలో అవుతుంది. దీనివల్ల గంటల తరబడి రీసెర్చ్ చేసే పని తప్పుతుంది.

36
క్రోమా: మీ వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా..

క్రోమా టూల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా మీ అభిరుచికి అనుగుణంగా పనిచేస్తుంది. మొదట మీరు మీకు నచ్చిన 50 రంగులను ఎంచుకోవాలి. ఆ తర్వాత దీనిలోని న్యూరల్ నెట్‌వర్క్ మీ టేస్ట్‌ను అర్థం చేసుకుని, కలర్ కాంబినేషన్లను సృష్టిస్తుంది. ఇది ఆన్‌లైన్‌లో పాపులర్ అయిన ప్యాలెట్లను బట్టి మీకు హెక్స్ కోడ్‌లు, ఆర్జీబీ విలువలను కూడా ఇస్తుంది. ఇది ఒక నిర్దిష్ట స్టైల్‌లో దుస్తులు ధరించాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్. అంతేకాదు, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ రంగులు ఉన్నాయో లేదో కూడా ఇది రేటింగ్ ఇస్తుంది.

46
ముజ్లి AI కలర్స్.. ఫాస్ట్ ఐడియాల కోసం

వెంటనే అవుట్‌ఫిట్ ఐడియాల కోసం 'ముజ్లి AI కలర్స్' ఒక సూపర్ టూల్. ఏదైనా కీవర్డ్ లేదా ఒక రిఫరెన్స్ కలర్ ఇస్తే చాలు, ఇది వెంటనే ప్రొడక్షన్-రెడీ ప్యాలెట్లను అందిస్తుంది. వీటిని ఫిగ్మా లేదా సీఎస్ఎస్ వంటి డిజైన్ ప్లాట్‌ఫారమ్‌లకు సులభంగా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. ఫ్యాషన్ డిజైనర్లు ఒకే రీతిలో ఉండే లుక్స్‌ను క్రియేట్ చేయడానికి ఇది ఒక డిజైన్ ఎకోసిస్టమ్‌లా పనిచేస్తుంది. ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన ఛాయిస్.

56
కూలర్స్ : ప్రతిరోజూ ఉపయోగపడే టూల్

సాధారణ వ్యక్తుల నుండి ప్రొఫెషనల్ డిజైనర్ల వరకు అందరికీ ఉపయోగపడే టూల్ కూలర్స్. దీనిలో ఒక ఫోటోను అప్‌లోడ్ చేస్తే, ఆ ఫోటోలోని రంగులను ఇది విడదీసి చూపిస్తుంది. మీ దగ్గర ఉన్న డ్రెస్ ఫోటో తీసి ఇందులో పెడితే, దానికి సరిపోయే ఇతర రంగులను ఇది సూచిస్తుంది. ఇందులో ఉచితంగా లభించే ఫీచర్లు రోజువారీ అవసరాలకు సరిపోతాయి. ప్రో వెర్షన్ టీమ్ ప్రాజెక్టులకు ఉపయోగపడుతుంది. ఇది చాలా ఈజీగా ఉండటం వల్ల ఎవరైనా సులభంగా వాడవచ్చు.

66
హ్యూమింట్

హ్యూమింట్ అనే టూల్ మీ ఊహలకు ఒక వాస్తవ రూపం ఇస్తుంది. ఇందులో క్రియేటివిటీ స్లైడర్ ఉంటుంది. దీని ద్వారా మీరు సేఫ్ కలర్స్ లేదా బోల్డ్ రంగులను ఎంచుకోవచ్చు. వెబ్‌సైట్ మాకప్స్ లేదా అవుట్‌ఫిట్ ప్రివ్యూల ద్వారా, ఆ రంగుల కలయిక నిజంగా ఎలా ఉంటుందో ముందే చూసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories