Palm Oil : 20 కిలోల ఆయిల్ పామ్ గెలనుండి ఎంత పామాయిల్ వస్తుంది?

Published : Nov 25, 2026, 12:16 PM IST

అయిల్ పామ్ గెలలనుండేే పామాయిల్ వస్తుంది… ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎన్ని కిలోల ఆయిల్ పామ్ గెలలనుండి ఎన్ని లీటర్ల పామాయిల్ వస్తుందో మీకు తెలుసా?

PREV
14
ఎంత ఆయిల్ పామ్ నుండి ఎంత పామాయిల్ వస్తుంది?

ఆయిల్ పామ్... తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ప్రభుత్వాలు బాగా ప్రోత్సహిస్తుండటంతో తెలుగు రైతులు ఈ పంట వైపు మళ్లుతున్నారు... దీంతో కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు అవుతోంది. ఇండియాలో అత్యధికంగా ఆయిల్ పామ్ దిగుబడి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ టాప్ లో ఉన్నాయి.

సన్ ప్లవర్, గ్రౌండ్ నట్ వంటి వంటనూనెలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న పామాయిల్ ఈ ఆయిల్ పామ్ నుండే వస్తుంది. అత్యధికంగా నూనె దిగుబడి ఇచ్చే ఈ బహువార్షిక పంట రైతులకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది... అంతేకాదు తక్కువ ధరలో లభించే పామాయిల్ సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక బారాన్ని తగ్గిస్తోంది.

ఆయిల్ పామ్ గెలల నుండి పామాయిల్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎన్నికిలోల ఆయిల్ పామ్ గెల నుండి ఎంత పామాయిల్ వస్తుందో తెలుసా? అసలు ఆయిల్ పామ్ గెలల నుండి పామాయిల్ ఎలా తయారుచేస్తారు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

24
ఆయిల్ పామ్ సాగు విధానం

ఇండియాలో ప్రస్తుతం పామాయిల్ వినియోగం బాగా పెరిగింది. ఇతర నూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువ... అంతేకాదు ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్నిరకాల పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు కూడా పామాయిల్ ఉత్పత్తి, వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే పామాయిల్ ఉత్పత్తి పెరిగినా వినియోగం ఎక్కువగా ఉండటంతో ఇప్పటికీ ఆయిల్ పామ్ ను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. పామాయిల్ సాగు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ లో దిగుమతి తగ్గే అవకాశాలున్నాయి.

అయితే ఆయిల్ పామ్ సాగు అనేది సుదీర్ఘ ప్రాసెస్. పంట వేసిన వెంటనే కాత రాదు... ఐదారు సంవత్సరాలకు గానీ రైతుల చేతికి పంట డబ్బురాదు. అందుకే రైతులు ఆయిల్ పామ్ వేసిన భూముల్లో అంతరపంటలు కూడా వేస్తుంటారు... కానీ కాత మొదలయ్యాక అంతరపంటల సాగు నిలిపివేస్తారు. ఒక్క ఎకరంలో 50-60 ఆయిల్ పామ్ చెట్లు వేస్తుంటారు... ఈ చెట్లకు ఎక్కువ నీరు అవసరం, అంటే సాగునీరు అందుబాటులో ఉన్న భూముల్లో ఈ పంట వేయాల్సి ఉంటుంది.

చెట్లు నాటిన నాలుగేళ్ల తర్వాత గెలలు కాస్తాయి.. అయితే 8 లేదా 9వ ఏట నుండి పూర్తిస్థాయి కాత మొదలవుతుంది. ఇలా దాదాపు 30 ఏళ్లపాటు ఆయిల్ పామ్ చెట్ల నుండి పంట తీసుకోవచ్చు. గెలలు కోసిన వెంటనే మిల్లుకి తరలించాలి… లేదంటే ఆయిల్ క్వాలిటీ తగ్గుతుంది. ఈ ఆయిల్ పామ్ సాగు, డ్రిప్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది.

34
20Kg గెల నుండి ఎంత పామాయిల్ వస్తుంది?

సాధారణంగా ఆయిల్ పామ్ గెలలను కోసిన 24 గంటల్లోపు మిల్లుకు తరలిస్తుంటారు రైతులు. అక్కడ ఈ గెలలను హై టెంపరేచర్ వద్ద ఉడికిస్తారు... అనంతరం పండ్లను వేరుచేస్తారు. ఈ పండ్ల నుండే క్రూడ్ పామాయిల్ నూనె వస్తుంది... గుజ్జుతో పాటు గింజ నుండి కూడా నూనెలు తీస్తారు.

20 కిలోల ఆయిల్ ఫామ్ గెల నుండి దాదాపు 3.5 నుండి 4 లీటర్ల క్రూడ్ పామ్ ఆయిల్ వస్తుంది. అయితే గెల పక్వత, విత్తనం రకం, కోత తర్వాత మిల్లుకు తరలించే సమయం, ప్రాసెసింగ్ విధానాన్ని బట్టి పామాయిల్ దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ క్రూడ్ పామాయిల్ నుండి మనం తినేందుకు ఉపయోగించే స్వచ్చమైన పామాయిల్ ను వేరుచేస్తారు... ఇలా 4 లీటర్ల క్రూడ్ పామాయిల్ నుండి దాదాపు 3.5 నుండి 3.7 లీటర్ల రిఫైన్డ్ పామాయిల్ వస్తుంది.

44
పామాయిల్ ఉపయోగాలు..

ఆయిల్ పామ్ పంటనుండి తయారయ్యే పామాయిల్ ను వంటనూనెగా ఉపయోగిస్తారు... డీప్ ప్రైయింగ్, స్నాక్స్ తయారీ, బేకరీ ఉత్పత్తుల్లోనే కాదు ఐస్ క్రీమ్ తయారీలోనే వాడతారు. ఇలా అహార పరిశ్రమలో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు.

ఇక సౌందర్య వస్తువుల్లోనూ పామాయిల్ వాడతారు. ముఖ్యంగా సబ్బులు, షాంపూలు, లోషన్లు, లిప్ స్టిక్స్ లో నురగ, సాప్ట్ నెస్ కోసం వాడతారు. టూత్ పేస్టుల్లో కూడా ఉపయోగిస్తారు. పారిశ్రామికంగా యంత్రాల లూబ్రికెంట్స్ తయారీలోనూ ఈ పామాయిల్ ఉపయోగిస్తారు. ఇలా అనేేక రంగాల్లో పామాయిల్ వినియోగిస్తారు… అందుకే దీనికి ఇంత డిమాండ్.

Read more Photos on
click me!

Recommended Stories