Salary: ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి. ఈ దేశంలో ఎక్కడ చూసినా వ్యవస్థ అంతా రూల్స్ ప్రకారమే చాలా క్లాస్‌గా జరుగుతుంది. మరి అలాంటి అమెరికాలోనూ అడుక్కునేవారు ఉంటారా? ఉంటే వారు రోజుకు ఎంత సంపాదిస్తారు?
అమెరికా అనగానే మనందరికీ ఎత్తైన భవనాలు, విలాసవంతమైన జీవనశైలి, కార్పొరేట్ ఉద్యోగాలు గుర్తుకొస్తాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన యూఎస్‌ఏ (USA)లో కూడా వీధుల్లో అడుక్కునేవారు ఉంటారా అనే సందేహం చాలామందికి రావచ్చు. అక్కడ కూడా వేలాది మంది వీధి కూడళ్లలో, సబ్‌వే స్టేషన్లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సహాయం కోరుతూ కనిపిస్తారు. వారిని స్థానికంగా 'ప్యాన్‌హ్యాండ్లర్లు' (Panhandlers) అని పిలుస్తారు. మరి వీరు రోజుకు ఎంత సంపాదిస్తారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం?
25
అమెరికా భిక్షగాళ్ల రోజువారీ ఆదాయం?
కొంతమంది అమెరికాలో అడుక్కునేవారు రోజుకు సగటున 200 నుండి 500 డాలర్ల (అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు ₹16,000 నుండి ₹40,000) వరకు సంపాదిస్తారని అంటుంటారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు అలా ఉండవు. అక్కడ ఒక సాధారణ ప్యాన్‌హ్యాండ్లర్ రోజుకు సగటున $15 నుండి $50 డాలర్లు (అంటే భారత కరెన్సీలో ₹1,200 నుండి ₹4,000) వరకు మాత్రమే సంపాదిస్తారు. వీరిలో చాలామంది రోజుకు 4 నుండి 8 గంటల పాటు వీధుల్లోనే నిలబడతారు. ఈ లెక్కన గంటకు సగటున $3 నుండి $10 వరకు మాత్రమే లభిస్తుంది.
35
నగరాన్ని బట్టి ఆదాయం మారుతుంది..
న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ లేదా సీటెల్ వంటి పెద్ద పర్యాటక నగరాలు, రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో కొందరికి రోజుకు $80 నుండి $100 వరకు (రోజుకు దాదాపు ₹8,000 నుండి ₹10,000 వరకు) సంపాదిస్తారు. అయితే అందరికీ ఒకేలా ఉండదు. ఇది అమెరికాలోని కొన్ని రాష్ట్రాల కనీస వేతనానికి (Minimum Wage) సమానం.
అమెరికాలో కొందరు వృత్తిపరమైన భిక్షగాళ్లు (Professional Beggars) కూడా ఉంటారు. వికలాంగులుగా నటించడం, పెంపుడు కుక్కలను పక్కన పెట్టుకోవడం, ఎమోషనల్ బోర్డులు ప్రదర్శించడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షిస్తారు. ఇలాంటి వారిలో కొందరు ఏడాదికి $50,000 డాలర్లకు పైగా (సుమారు ₹42 లక్షలు) పన్ను లేని ఆదాయాన్ని ఆర్జిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
అమెరికాలో ప్రతి ప్యాన్‌హ్యాండ్లర్ సోమరితనం వల్లే ఈ మార్గాన్ని ఎంచుకోరు. వీరి వెనుక అనేక తీవ్రమైన సామాజిక, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ప్యాన్‌హ్యాండ్లింగ్ చేసేవారిలో 30% కంటే ఎక్కువ మంది తీవ్రమైన మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యధిక వైద్య ఖర్చుల వల్ల అప్పుల్లో కూరుకుపోయి, ఇళ్లు కోల్పోయి రోడ్డున పడినవారు ఉన్నారు. అంతేకాకుండా సరైన నివాస చిరునామా (Permanent Address), గుర్తింపు కార్డులు మరియు విద్యార్హతలు లేకపోవడం వల్ల వీరికి చిన్న ఉద్యోగాలు కూడా దొరకవు. దాంతో బెగ్గర్స్‌గా మారుతారు. మరికొందరు చెడు అలవాట్లు లేదా మాదకద్రవ్యాల (Drugs) బారిన పడి సమాజానికి దూరమై ఈ స్థితికి చేరుకుంటారు.
ప్యాన్‌హ్యాండ్లర్లలో రకాలు
అమెరికాలో అడుక్కునేవారిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అందులో మొదటిరకం పాసివ్ ప్యాన్‌హ్యాండ్లింగ్ (Passive).వీరు నిశ్శబ్దంగా ఒక బోర్డు పట్టుకుని కూర్చుంటారు ఉదాహరణకు "Homeless and Hungry, God Bless You". ఎవరినీ నేరుగా అడగరు. రెండో రకం యాక్టివ్ అండ్ అగ్రెసివ్ ప్యాన్‌హ్యాండ్లింగ్ (Aggressive). వీరు వ్యక్తులను నేరుగా టార్గెట్ చేస్తారు. వాహనాల వద్దకు వచ్చి డబ్బులు అడుగుతారు. కొన్ని నగరాల్లో ఈ పద్ధతిపై చట్టపరమైన నిషేధం ఉంది.
55
అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుంది
యూట్యూబర్లు చూపించేవన్నీ వాస్తవాలని చెప్పలేము. నిజానికి అమెరికాలోని ప్యాన్‌హ్యాండ్లర్ల సంపాదన అక్కడి కనీస జీవన వ్యయంతో పోలిస్తే చాలా తక్కువ. ఆ డబ్బు కేవలం వారి రోజువారీ ఆహారం, ప్రాథమిక అవసరాలకు మాత్రమే సరిపోతుంది. అమెరికా ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు (NGOs) వీరికి ఉచిత ఆహారం, రాత్రి వేళల్లో షెల్టర్ కల్పిస్తున్నప్పటికీ, ప్యాన్‌హ్యాండ్లింగ్ అనేది అక్కడి సమాజంలో నేటికీ ఒక సవాలుగానే మిగిలింది.