5. క్యూరింగ్ చాలా ముఖ్యం
గోడ కట్టడం పూర్తయ్యాక క్యూరింగ్ చేయడాన్ని చాలామంది లైట్ తీసుకుంటారు. సిమెంట్ మిశ్రమానికి బలం రావాలంటే కచ్చితంగా కొన్ని రోజుల పాటు నీళ్లు పట్టాలి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) రూల్స్ ప్రకారం.. ఇటుకతో కట్టిన గోడలను కనీసం 7 రోజుల పాటు తడిగా ఉంచాలి. పని అయిపోయింది కదా ఇక నీళ్లు అవసరం లేదు అనుకోవడం పొరపాటు. వాతావరణం, వాడిన మెటీరియల్‌ను బట్టి ఇంజనీర్ సలహా మేరకు క్యూరింగ్ చేయాలి.
గోడల పగుళ్లకు మరిన్ని కారణాలు..
పునాది, మట్టి స్వభావం, స్ట్రక్చరల్ డిజైన్, భూకంపాలు, వాతావరణ మార్పులు, చెమ్మ, ఇంటి వయసు లాంటి ఎన్నో కారణాల వల్ల గోడలకు పగుళ్లు వస్తుంటాయి. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇటుక పనులకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అందుకే కేవలం మెటీరియల్ కొనిచ్చేసి ఊరుకోకుండా, ఒక క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో ఇల్లు కట్టుకోవడం ఉత్తమం. సరైన ప్లానింగ్, క్వాలిటీ మెటీరియల్, కరెక్ట్ క్యూరింగ్ ఉంటే భవిష్యత్తులో వచ్చే చాలా సమస్యలను ముందే ఆపొచ్చు.