ఇది కేవలం ఒక పడుకునే గది మాత్రమే కాదు, సముద్రపు ఒడ్డున నిర్మించిన ఒక అల్ట్రా-లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్ విల్లా. లంకవిలోని దట్టమైన వర్షారణ్యాలు (Rainforests), అండమాన్ సముద్రపు నీలి జలాలు కలిసే చోట ఇది ఉంటుంది. ఈ విల్లాకు అనుబంధంగా ఒక పెద్ద ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. పూల్‌లో ఈదుకుంటూ నేరుగా సముద్రపు అందాలను, సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. విల్లా వెనుక తలుపు తీస్తే నేరుగా తెల్లటి ఇసుక బీచ్ (White Sand Beach) లోకి అడుగు పెట్టవచ్చు. ఈ బీచ్ ఏరియా కేవలం ఆ రూమ్‌లో ఉన్న వారికి మాత్రమే కేటాయించబడుతుంది.
గదిలోని ఫర్నిచర్, గ్లాస్ విండోస్, బాత్ టబ్స్ అన్నీ అంతర్జాతీయ డిజైనర్లతో రూపొందించబడ్డాయి. బెడ్రూమ్ నుండి చూస్తే 180 డిగ్రీల సముద్రపు వ్యూ కనిపిస్తుంది. సముద్రంలో చేపల మధ్య గదిలో కపుల్స్ క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేసే విధంగా ఈ రూమ్స్ డిజైన్ చేయబడ్డాయి. బాత్ రూమ్ లో కూడా సముద్రం లోపల వ్యూ కనిపించేలా ఈ రూమ్స్ డిజైన్ చేశారు.
ఎందుకు అంత కాస్ట్?
ఈ విల్లాకు అంత ధర ఉండటానికి ప్రధాన కారణం "ప్రైవసీ - వివిఐపి (VVIP) సేవలు". మీరు రూమ్‌లోకి వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు మీ సేవ కోసం ఒక ప్రత్యేక వ్యక్తిగత అసిస్టెంట్ (Butler) అందుబాటులో ఉంటారు. మీ లగేజీ సర్దడం, మీకు ఇష్టమైన వంటకాలను ప్రైవేట్ చెఫ్‌తో చేయించడం, మీ ప్రయాణ ఏర్పాట్లు అన్నీ ఆయనే చూసుకుంటారు.ఇక్కడికి వచ్చే సెలబ్రిటీల సమాచారం అత్యంత రహస్యంగా ఉంచబడుతుంది. బయటి ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేకుండా, ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలా ప్రత్యేక సెక్యూరిటీ ఉంటుంది.
విమానాశ్రయం నుండి నేరుగా రిసార్ట్‌కు చేరుకోవడానికి ప్రైవేట్ హెలికాప్టర్ సర్వీస్, విల్లా వద్దే హెలిప్యాడ్ సదుపాయాలు ఉంటాయి.