కేవలం జీతం మాత్రమే చూసి అమెరికా వెళ్లడం కుదరదు. అక్కడ ఉద్యోగం చేయడానికి వీసా ప్రాసెస్, ట్యాక్స్ సిస్టమ్ అర్థం చేసుకోవడం ముఖ్యం.
• H-1B వీసా: నిపుణులైన ఉద్యోగుల కోసం దీనిని ఉపయోగిస్తారు. FY2024లో ఆమోదం పొందిన H-1B పిటిషన్లలో భారత్‌లో జన్మించిన లబ్ధిదారులు 2,83,397 (71%) మంది ఉన్నారు.
• L-1, O-1 వీసాలు: ఇంటర్నెట్ లేదా ఎంఎన్‌సీ కంపెనీల అంతర్గత బదిలీలకు L-1 వీసా, అసాధారణ నైపుణ్యం ఉన్న పరిశోధకులకు O-1 వీసాలు ఉపయోగిస్తారు.
• STEM OPT: యూఎస్‌లో STEM కోర్సులు చేసిన భారతీయ విద్యార్థులకు హెచ్-1బి రాకపోయినా, మూడేళ్ల పాటు పనిచేసే అవకాశం దక్కుతుంది.
అమెరికాలో అత్యధిక జీతం పొందాలంటే డాక్టర్, సర్జన్ వంటి వృత్తులు మొదటి స్థానంలో ఉంటాయి. కానీ భారతీయులకు వేగంగా, సులువుగా అవకాశాలు దక్కేది మాత్రం ఏఐ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫైనాన్స్ రంగాల్లోనే.