రూ. 200 ఖర్చు చేస్తే వచ్చే ఫైబర్ రూ. 30 కే, రేటు తక్కువలో ప్రోటీన్స్, ఫైబర్ ఎందులో దొరుకుతాయో తెలుసా?

Published : Oct 22, 2026, 10:30 AM IST

బాదం పప్పపకు బదులు పల్లీలు, బెర్రీలకు బదులు ఉసిరిగాయలు .. తక్కువ ఖర్చుతో ప్రోటీన్, ఫైబర్ పొందడం ఎలా? 200 రూపాయలు ఖర్చు చేసేచోట కేవలం 30 నుంచి 50 రూపాయలు ఖర్చు పెడితే చాలు పిల్లలకు మంచి ఫుడ్ అందించవచ్చని మీకు తెలుసా?

PREV
13
ఎక్కువ రేటు పడితే.. ఎక్కువ బలం రాదు..

ప్రస్తుత కాలంలో ఆరోగ్య స్పృహ పెరిగిన కొద్దీ చాలామంది మార్కెట్‌లో లభించే ఖరీదైన హెల్త్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. "ఎక్కువ ధర ఉంటేనే అందులో ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి" అనే భావన చాలామందిలో నెలకొంది. అయితే, ఈ భావన పూర్తిగా సరికాదు. మన బడ్జెట్‌లోనే లభించే కొన్ని దేశీ ఆహార పదార్థాలు (Desi Superfoods) విదేశీ లేదా ఖరీదైన ఆహారాల కంటే మెరుగైన పోషకాలను అందిస్తాయి. మీ ఆరోగ్యాన్ని, జేబును ఒకేసారి కాపాడుకునే కొన్ని స్మార్ట్ డైట్ మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం స్థానంలో పల్లీలు (వేరుశనగలు)

అనేకమంది ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ కోసం బాదం పప్పులను తింటుంటారు. కానీ, ధర పరంగా చూస్తే బాదం చాలా ఖరీదైనది. పావుకిలో బాదాం కోసం 200 రూపాయలు పైనే ఖర్చు పెట్టాలి. దానికి బదులుగా మనకు సులభంగా లభించే వేరుశనగలు (పల్లీలు) తీసుకోవచ్చు. పల్లీలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు వేయించిన లేదా నానబెట్టిన పల్లీలు తినడం వల్ల బాదంతో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దానికి మనకు అయ్యే ఖర్చు 30 నుంచి 50 రూపాయలు మాత్రమే.

23
ఫారెన్ బెర్రీలకు ప్రత్యామ్నాయంగా ఉసిరికాయ & జామకాయ

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C కోసం బ్లూబెర్రీస్, అవకాడో వంటి విదేశీ పండ్లను కొనడం వల్ల బడ్జెట్ పెరుగుతుంది. మన ప్రాంతంలో దొరికే ఉసిరికాయ (Amla) లో విటమిన్ C అపారంగా ఉంటుంది. అలాగే తక్కువ ధరకే లభించే జామకాయలో ఫైబర్, విటమిన్ C మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఉసిరిగాయలకు పెద్దగా ఖర్చు ఉందు... మహా అయితే అరకిలో 50 రూపాయల లోపే ఉంటాయి.

33
క్వినోవాకు బదులుగా రాగులు, జొన్నలు

ఫిట్‌నెస్ ప్రియులు తరచూ క్వినోవా (Quinoa) ను తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇది చాలా ఖరీదైనది. కిలో 200 రూపాయల వరకు పెట్టాల్సి వస్తుంది. కానీ మన సాంప్రదాయ తృణధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు అంతకంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. రాగులలో క్యాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి మరియు బరువు నియంత్రణకు ఎంతో దోహదపడతాయి. ఇవి కిలో 60 నుంచి 80 రూపాయల్లో దొరుకుతాయి.

ప్రోటీన్ పౌడర్లకు బదులుగా గుడ్లు, శనగలు, పెసలు

జిమ్‌కు వెళ్లేవారు రూ.వేలు వెచ్చించి బాటిళ్ల కొద్దీ ప్రోటీన్ పౌడర్లు కొంటుంటారు. కానీ సహజ సిద్ధంగా లభించే గుడ్లు, నానబెట్టిన గుడాలు (శనగలు, పెసలు), పప్పు ధాన్యాలు మరియు పనీర్ ద్వారా శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్రోటీన్ సులభంగా లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన ఆహారమే తినాల్సిన అవసరం లేదు. స్థానికంగా, తక్కువ ధరకే లభించే పోషకాహారాన్ని సరిగ్గా ఎంచుకుని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా డబ్బును పొదుపు చేస్తూనే మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

(గమనిక: ప్రతి ఒక్కరి శరీర తత్వం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి మీ ఆహారంలో పెద్ద మార్పులు చేసేముందు వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించడం శ్రేయస్కరం).

Read more Photos on
click me!

Recommended Stories