Google Pay, PhonePe లో తెలియని వారికి డబ్బులు పంపారా? టెన్షన్ వద్దు, ఇలా చేస్తే మీ డబ్బులు తిరిగొచ్చేస్తాయి

Published : Oct 15, 2026, 10:47 AM IST

స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు గూగుల్ పే, ఫోన్‌పే ఉండాల్సిందే… ఈ యూపిఐ యాప్స్ ద్వరానే అన్ని పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఒక్కోసారి పొరపాటున ఒకరికి వేయబోయి ఇంకొకరికి డబ్బులు వేస్తుంటాం... ఇలాంటప్పుడు ఏం చేయాలో తోచదు. ఆ డబ్బులు ఎలా తిరిగిపొందాలో తెలుసా?

PREV
15
రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారా..? ముందుగా ఏం చేయాలి?

గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా ఫోన్ నుండే క్షణాల్లో డబ్బులు పంపించవచ్చు... బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఒక్క క్లిక్ తో ట్రాన్సాక్షన్స్ జరపొచ్చు. ఇలా యూపిఐ యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం ఎంత ఈజీనో కొన్నిసార్లు అంత రిస్క్ కూడా. మరీముఖ్యంగా హడావుడిలో ఒకరికి వేయబోయి ఇంకొకరికి డబ్బులు పంపే రిస్క్ ఉంటుంది. తప్పు యూపీఐ ఐడీ కొట్టినా, నంబర్ తప్పుగా ఎంటర్ చేసినా, వేరొకరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా డబ్బులు వేరే అకౌంట్‌కి వెళ్లిపోతాయి… ఒకసారి పేమెంట్ సక్సెస్ అయ్యాక, దాన్ని క్యాన్సిల్ చేయడం కుదరదు.

అయితే తప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కంగారుపడిపోకండి... ఆ యాప్ వాళ్లకి లేదా మీ బ్యాంకుకి కంప్లైంట్ చేసి డబ్బులు వెనక్కి తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా కంప్లైంట్ చేయడానికి లేట్ చేయకండి. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ వెంటనే దగ్గర పెట్టుకోండి. ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసా?

25
1. ముందుగా యూపీఐ యాప్‌లో కంప్లైంట్ చేయండి

మీరు ఏ యాప్ ద్వారా డబ్బులు పంపారో, ముందుగా అందులోనే కంప్లైంట్ చేయాలి. దీనికోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

• మీరు వాడిన యూపీఐ యాప్ ఓపెన్ చేయండి.

• ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్లండి.

• తప్పుగా జరిగిన పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి.

• అందులో 'Raise a Complaint', 'Report an Issue' లేదా అలాంటి ఆప్షన్ ఎంచుకోండి.

• ఏం జరిగిందో చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి.

కంప్లైంట్ చేశాక వచ్చే రిఫరెన్స్ నంబర్‌ను జాగ్రత్తగా దాచుకోండి. తర్వాత స్టేటస్ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

2. వెంటనే మీ బ్యాంకును కాంటాక్ట్ చేయండి

యూపీఐ యాప్‌లో కంప్లైంట్ చేసి ఊరుకోకండి. వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, తప్పుగా డబ్బులు పంపిన విషయం చెప్పండి. బ్యాంకుకు కంప్లైంట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ రెడీగా ఉంచుకోండి.

• డబ్బులు పంపిన తేదీ, సమయం.

• ఎంత అమౌంట్ పంపారు.

• యూపీఐ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్.

• డబ్బులు వెళ్లిన వ్యక్తి యూపీఐ ఐడీ లేదా ఇతర డీటెయిల్స్.

• మీరు వాడిన యాప్ పేరు.

• యాప్‌లో కంప్లైంట్ చేసిన రిఫరెన్స్ నంబర్.

బ్యాంకులో కంప్లైంట్ రిజిస్టర్ చేసి, ఆ నంబర్ తీసుకోండి. డబ్బులు వెనక్కి రావడానికి ఎంత టైమ్ పడుతుందో అడిగి తెలుసుకోండి.

బ్యాంకుకు డైరెక్ట్‌గా కంప్లైంట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ బ్యాంకు అవతలి వ్యక్తి బ్యాంకుతో మాట్లాడి డబ్బులు వెనక్కి తెప్పించే ప్రాసెస్ మొదలుపెడుతుంది.

35
3. డబ్బులు వెనక్కి రావడానికి ఎందుకు లేట్ అవుతుంది?

రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో ముందుగా పేమెంట్ ఫెయిల్ అయిందా లేదా సక్సెస్ అయిందా అనేది చూడాలి. పేమెంట్ ఫెయిల్ అయ్యి మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అయితే రూల్స్ ప్రకారం ఆ డబ్బులు ఆటోమేటిక్‌గా వెనక్కి వచ్చేస్తాయి. దీనికి పట్టే టైమ్ ట్రాన్సాక్షన్‌ను బట్టి మారుతుంది.

పేమెంట్ సక్సెస్ అయ్యి వేరే వాళ్ల అకౌంట్‌కి వెళితే దీని ప్రాసెస్ వేరుగా ఉంటుంది. అవతలి వ్యక్తి అకౌంట్‌లో డబ్బులు పడ్డాక, మీ బ్యాంకు దానంతట అదే ఆ డబ్బును వెనక్కి తీసుకోలేదు. ఇలాంటప్పుడు మీ బ్యాంకు అవతలి బ్యాంకును కాంటాక్ట్ చేసి రిక్వెస్ట్ పెడుతుంది. డబ్బులు అందుకున్న వ్యక్తిని కాంటాక్ట్ చేసి, అమౌంట్ వెనక్కి ఇచ్చేలా చూస్తారు.

అయితే కంప్లైంట్ చేయగానే డబ్బులు వెంటనే వచ్చేస్తాయని గ్యారెంటీ లేదు. అవతలి వ్యక్తి ఎంతవరకు సహకరిస్తాడు, బ్యాంకులు తీసుకునే యాక్షన్ మీద ఇది ఆధారపడి ఉంటుంది.

45
4. డబ్బులు అందుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వనంటే ఏం చేయాలి?

పొరపాటున డబ్బులు అందుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుంటే, బ్యాంకు ప్రాసెస్ ద్వారా డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. కానీ ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వనని మొండికేస్తే ఏం చేయాలి? ఇలాంటప్పుడు, మీ దగ్గర ఉన్న కంప్లైంట్ రిఫరెన్స్ నంబర్‌తో మీ బ్యాంకును పదే పదే అడగాలి. పేమెంట్ ప్రూఫ్స్, యాప్‌లోని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, బ్యాంకుతో మాట్లాడిన వివరాలు అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

బ్యాంకు సరిగ్గా స్పందించకపోయినా, సమస్య పరిష్కారం కాకపోయినా, ముందుగా ఆ బ్యాంకు గ్రీవెన్స్ సెల్‌లో అప్పీల్ చేయాలి. అయినా కూడా లాభం లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంబుడ్స్‌మన్‌కు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అయితే దీనికి కొన్ని రూల్స్, టైమ్ లిమిట్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి.

55
5. రాంగ్ పేమెంటా? యూపీఐ ఫ్రాడా? తేడా తెలుసుకోండి

తప్పుగా వేరే వాళ్లకి డబ్బులు పంపడం, సైబర్ మోసం వల్ల మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వడం.. ఈ రెండూ వేర్వేరు. మీరు తప్పు యూపీఐ ఐడీ కొట్టి డబ్బులు పంపితే అది రాంగ్ ట్రాన్సాక్షన్. కానీ మీరు చేయకుండానే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే అది ఫ్రాడ్ కిందకు వస్తుంది. ఇలాంటప్పుడు వెంటనే మీ బ్యాంకుకు కాల్ చేసి కంప్లైంట్ చేయాలి. అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. ఇలాంటి ఫ్రాడ్స్ జరిగినప్పుడు, రూల్స్ ప్రకారం కస్టమర్ బాధ్యత ఎంత, డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్స్ ఎంత అనేది డిసైడ్ అవుతుంది.

6. యూపీఐ ద్వారా డబ్బులు పంపేటప్పుడు ఈ తప్పులు చేయకండి

రాంగ్ ట్రాన్సాక్షన్స్ వల్ల వచ్చే తలనొప్పులు తప్పించుకోవాలంటే, డబ్బులు పంపే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

• పేరు చెక్ చేయండి : డబ్బులు పంపే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరు కరెక్టేనా అని చూసుకోండి.

• యూపీఐ ఐడీ చూసుకోండి : ఒకే పేరుతో చాలా అకౌంట్లు ఉండొచ్చు, కాబట్టి ఐడీని పూర్తిగా చెక్ చేయండి.

• క్యూఆర్ కోడ్ కన్ఫర్మ్ చేసుకోండి : షాపుల్లో లేదా వ్యక్తులకు డబ్బులు ఇచ్చేటప్పుడు, సరైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారో లేదో చూసుకోండి.

• అమౌంట్ చెక్ చేయండి : డబ్బులు పంపే ముందు మీరు కొట్టిన అమౌంట్ కరెక్టేనా అని ఒకటికి రెండుసార్లు చూసుకోండి.

• డీటెయిల్స్ సేవ్ చేసుకోండి : డబ్బులు పంపాక వచ్చే రిసీప్ట్, రిఫరెన్స్ నంబర్‌ను జాగ్రత్తగా ఉంచుకోండి.

తప్పు యూపీఐ ఐడీకి డబ్బులు పంపితే, టెన్షన్ పడకుండా వెంటనే యాక్షన్ తీసుకోవడం ముఖ్యం. ముందుగా మీరు వాడిన యాప్‌లో కంప్లైంట్ చేయండి. ఆ తర్వాత మీ బ్యాంకుకు కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. కంప్లైంట్ నంబర్, ప్రూఫ్స్ దాచుకుని ఫాలో అప్ చేస్తూ ఉండండి.

గుర్తుంచుకోండి : డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి కంప్లైంట్ చేయడం మొదటి స్టెప్ మాత్రమే. ప్రతి రాంగ్ ట్రాన్సాక్షన్‌కు డబ్బులు కచ్చితంగా వెనక్కి వస్తాయని గ్యారెంటీ లేదు. అందుకే, డబ్బులు పంపే ముందు పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్ చెక్ చేసుకోవడానికి కొన్ని సెకన్లు కేటాయిస్తే, తర్వాత వచ్చే పెద్ద కష్టాలను తప్పించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories