ఈ జీవి ప్రత్యేకత దాని ఆత్మరక్షణ వ్యూహంలో దాగి ఉంది. ఏదైనా వేటాడే జంతువు దీనిని తినడానికి వచ్చినప్పుడు, కాళ్లనే తలలుగా భావించి పొరపాటున కాళ్ళ దగ్గర దాడి చేస్తాయి. అంటే దెబ్బ కొట్టాల్సిన చోట కొట్టకుండా, వేరే చోట దాడి చేసేలా ఈ ఆకృతి వేటగాళ్లను ఏమారుస్తుంది . ఇలా తన కాళ్లనే ముఖంలా చూపిస్తూ ప్రిడేటర్స్ను మోసం చేసి, తన జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తుంది. ఈ యాంట్ ఈటర్స్ కి కంటి చూపు తక్కువగా ఉంటుంది. కానీ మంచి వాసన గ్రహించే శక్తి ఉంటుంది. వీటికి మనుషుల వాసన గ్రహించే శక్తి కంటే దాదాపు 40 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ చల్లని-రక్తంతో ఉండే జంతువులు రోజుకు దాదాపు 15 గంటలు నిద్రపోతాయి.
రోజుకు వేల చీమలే ఆహారం
ఈ జీవి ఆహారపు అలవాట్లు కూడా ఎంతో వింతగా ఉంటాయి. దీనికి చీమలే ప్రధాన ఆహారం. చీమల గూళ్ల వద్దకు వెళ్లి, తన పొడవాటి నాలుకతో చీమలను పట్టుకుని తింటుంది. రోజుకు 30,000 కు పైగా చీమలను తింటూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ చీమలతోనే కానిచ్చేస్తుంది. వాస్తవ జీవశాస్త్ర గణాంకాల ప్రకారం, ఈ పెద్ద చీమల ఆహారి (Giant Anteater) తన పొడవైన, జిగురుగా ఉండే నాలుకతో నిమిషానికి 150 సార్ల వరకు వేగంగా కదుపుతూ రోజుకు 3000 వరకు చీమలు, చెదపురుగులను కూడా తినగలదు. దంతాలు లేకపోయినప్పటికీ, బలమైన గోళ్లతో పుట్టలను తవ్వి తన నాలుక సాయంతో ఆహారాన్ని సులభంగా లాగేసుకుంటుంది. ఈ యాంట్ ఈటర్స్ శరీరంలో జీర్ణ ప్రక్రియలో కూడా ప్రత్యేకత కలిగి ఉంటాయి. వీటి కడుపులో, హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి బదులుగా ఫార్మిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది.ఇతర జీవులలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఈ లక్షణం కారణంగా వారు తినే చీమలను త్వరగా జీర్ణం చేస్తుంది.