కన్నకొడుకుల్ని విదేశాలకు పంపి.. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చుకుంటున్నారు, గరికపాటి మాస్ కౌంటర్

Published : Oct 17, 2026, 06:55 AM IST

Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సమాజంలో జరుగుతున్న వింత ధోరణులపై.. తన మార్క్ లో కౌంటర్ వేశారు,. ముఖ్యంగా పెట్స్ పట్ల మనుషులు వ్యవహరిస్తున్న తీరుపై గతంలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

PREV
14
కుక్కలకు అన్నం పెట్టాలి కానీ ..?

సమాజంలో జీవహింస చేయడం మంచిది కాదు, మూగజీవాలకు ముఖ్యంగా కుక్కలకు ఆహారం వేయడంలో ఎటువంటి తప్పు లేదని గరికపాటి స్పష్టం చేశారు. దయతో వాటికి కడుపునిండా అన్నం పెట్టాలని, అయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి అనుమతించకూడదని ఆయన హితవు పలికారు. నేటికాలంలో విదేశీ కుక్కల మోజు పెరిగిపోయింది, ఇళ్లలో పెంచుకోవడం ఒక పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయిందని, ఇది మన సంస్కృతికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.

24
విదేశీ కుక్కల పిచ్చి - విచిత్రమైన పరిస్థితి!

మన దేశంలో మన స్వదేశీ జాతి కుక్కలను కాపాడుకోవడం పోయి, ఆస్ట్రేలియా, అమెరికా వంటి విదేశాల నుంచి విదేశీ కుక్కలను లక్షలు ఖర్చుపెట్టి మరీ కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నామని గరికపాటి వెటకారంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మన దేశం వాళ్ళ తెలివితేటలు ఎవరికీ ఉండవు.. పనికొచ్చే కన్నకొడుకులను విదేశాలకు ఉద్యోగాల కోసం పంపిస్తాం, కానీ పనికిమాలిన విదేశీ కుక్కలను మాత్రం మన ఇంట్లోకి తెచ్చుకుంటాం" అంటూ చురకలంటించారు.

34
మనుషుల కంటే ఎక్కువ సేవ చేస్తున్నారు..

నేటి సమాజంలో మనుషులు తమ సొంత పిల్లలకు కూడా చేయని సేవలను పెంపుడు కుక్కలకు చేస్తున్నారని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలకు ప్రత్యేకంగా బ్రాండెడ్ సోపులతో స్నానాలు చేయించడం, వాటికి కాస్ట్యూమ్స్ వేయడం, ఉదయం సాయంత్రం వాకింగ్‌లు తిప్పడం వంటి వ్యాపకాలు పెరిగిపోయాయన్నారు. అంతేకాకుండా, వాటి కోసం ప్రత్యేకంగా డాక్టర్లు, ఖరీదైన వైద్యం, సోకులు, పార్లర్లు అంటూ విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆయన స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఆపదలో ఉన్న మనుషున్లు వదిలేసి కుక్కల కోసం బ్యూటీ పార్లర్లు ఏంటని ఆయన ప్రశ్నించారు.

44
మన రాజుల సంప్రదాయం వేరు!

ఒకప్పుడు మన దేశంలో మహారాజులు, జమీందారులు (పిఠాపురం, తుని జమీందారులు వంటి వారు) పశువులు, పక్షులు, ఏనుగులను ఎంతో గొప్పగా పోషించేవారని గరికపాటి గుర్తుచేశారు. అయితే అవి పనుల కోసం, సంప్రదాయం కోసం ఉండేవి తప్ప, నేడు ఇళ్లలో కుక్కలను పెంచుతూ చేసే అతివ్ మనుషుల సహజ జీవన విధానాన్ని మార్చేస్తున్నాయని ఆయన హెచ్చరించారు.

మొత్తంగా చూస్తే, మూగజీవాలపై జాలి చూపాలి కానీ, వాటిని ఇళ్లలోకి తెచ్చి మనుషులకంటే ఎక్కువగా చూసుకోవడం సరికాదనే సత్యాన్ని గరికపాటి నరసింహారావు గారు ఈ ప్రవచనం ద్వారా ఆలోచనలకు పదును పెట్టేలా చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories