Car Buying: భార్య పేరు మీద కారు కొంటే ఎంత లాభమో తెలుసా? సెలెబ్రిటీలు ఇలాగే కొంటారు

Published : Aug 31, 2026, 06:27 PM IST

Car Buying: కారు కొనాలనుకుంటున్నారా? మీ పేరు మీద కాకుండా, మీ భార్య పేరు మీద కారు కొనండి. దీనివల్ల కలిగే లాభాలు చాలా ఎక్కువ. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి. సెలెబ్రిటీలు అధికంగా ఖరీదైన కార్లను భార్య లేదా తల్లి పేరు మీదే కొంటుంటారు.

PREV
13
భార్య పేరుతో కారు కొంటే లాభాలేంటి?

మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మీద కాకుండా మీ భార్య, సోదరి లేదా తల్లి పేరు మీద కొనేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో డబ్బు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఈ ప్రయోజనాలు అందరికీ ఒకేలా వర్తించవు. బ్యాంకు ఇచ్చే ఆఫర్లు, లోన్ ప్లాన్, మీరు నివసించే రాష్ట్రంలోని నిబంధనల బట్టి లాభాలు మారతాయి.

23
తక్కువ వడ్డీ రేటు

కొన్ని బ్యాంకులు మహిళా కస్టమర్లకు ప్రత్యేక కార్ లోన్ ఆఫర్లు ఇస్తాయి. వడ్డీ రేటులో 0.5% తేడా ఉన్నా, దీర్ఘకాలిక లోన్‌లో మొత్తం వడ్డీ ఖర్చు తగ్గుతుంది. ఉదాహరణకు, వడ్డీ 8.5% ఉంటే, మహిళ పేరు మీద కొన్నప్పుడు 8%కే లోన్ రావచ్చు. లోన్ తీసుకునే ముందు, బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు, అర్హత నియమాలను చెక్ చేసుకోవడం ముఖ్యం.

కొన్ని ప్రత్యేక లోన్ స్కీమ్‌లలో తక్కువ డౌన్‌పేమెంట్ లేదా ఎక్కువ లోన్ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. మహిళల పేరు మీద కారు కొంటే అన్ని బ్యాంకులు 'జీరో డౌన్‌పేమెంట్' ఇస్తాయని చెప్పలేం. కానీ, ఉదాహరణకు మీరు రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టే చోట, రూ.2.5 లక్షలు కడితే సరిపోయే అవకాశం ఉండొచ్చు. బ్యాంకు నిబంధనలు చూసి లోన్ తీసుకోవాలి.

33
ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు

కొన్ని బ్యాంకులు లేదా వాహన కంపెనీలు మహిళా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తాయి. ఇందులో తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, ప్రత్యేక వడ్డీ రేటు లేదా వేగంగా లోన్ ప్రాసెస్ చేయడం వంటివి ఉంటాయి. అయితే ఇవి శాశ్వత నియమాలు కావు. ఆ సమయానికి ఉన్న ఆఫర్లు, బ్యాంకు షరతులను చూసి మీరు లోన్ తీసుకోవాలి.

మహిళ పేరు మీద కారు రిజిస్టర్ చేస్తే రోడ్ ట్యాక్స్ కూడా తగ్గుతుంది. ఇది రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతుంది. 2% నుంచి 10% వరకు రోడ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. కేవలం పన్ను ఆదా అవుతుందని నిర్ణయం తీసుకోకండి. బ్యాంకు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, డౌన్‌పేమెంట్, ఇన్సూరెన్స్, రాష్ట్రంలోని ప్రస్తుత రోడ్ ట్యాక్స్ నియమాలు.. అన్నీ పోల్చి చూసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories