సైంటిఫిక్ కారణం ఇదే..
బతికున్న పాము కోరల్లో విషయం ఉన్నట్లే.. పాము చనిపోయినా కూడా దాని కోరల్లో విషం ఉంటుంది. మనం తెలిసీ, తెలియక ఆ చనిపోయిన పాముని పట్టుకున్నా కూడా.. దాని కూరల్లోని విషయం మీ చర్మానికి తగిలితే ప్రాణానికి ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. బతికున్న పాముల మాదిరిగానే, వీటి విషం మన శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంతేకాదు, నాగు పాములు, కట్లపాములు, వైఫర్ లాంటి విషపూరితమైన పాములు హీమోటాక్సిన్ లను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషం మన శరీరానికి తగిలితే, అది మన నాడీ వ్యవస్థ, రక్తంపై ప్రభావం చూపుతుంది. పాము చనిపోయిన తర్వాత కూడా, హీమోటాక్సిన్ అనే విషం దాని కోరల్లో మిగిలి ఉంటుంది. ఈ విషయం కొన్ని గంటల పాటు పవర్ ఫుల్ గా ఉంటుంది. దీని వల్ల కూడా మనకు ప్రమాదం జరగొచ్చు.