తమ పిల్లలకు పేర్లు పెట్టుకునే హక్కు తల్లిదండ్రులకు మన దేశంలో ఉంది. కానీ ఓ దేశంలో మాత్రం తల్లిదండ్రులకు పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ఫ్రీడమ్ లేదు. కొన్ని కఠిన నిబంధనలు ఫాలో కావాల్సిందే.
మన దేశంలో పిల్లలు పుట్టినప్పుడు వాళ్లకు తల్లి దండ్రులు ఎంతో సంతోషంతో ఒక వేడుకలా పేర్లు పెడుతుంటారు. ఇండియాలో చాలా సంప్రదాయాల్లో నామకరణం అనేది ఒక పండుగలా జరుగుతుంది. తల్లి దండ్రులు వాళ్లకు నచ్చిన పేర్లని తమ పిల్లలకు పెట్టుకునే హక్కు ఇండియాలో ఉంది. పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలి అనేది పూర్తిగా తల్లిదండ్రుల ఇష్టం. కానీ ఓ దేశంలో ఇలాంటి ఫ్రీడమ్ తల్లిదండ్రులకు లేదు అంటే నమ్మగలరా ? ఆ దేశంలో పిల్లలకు తల్లి దండ్రులు తమకు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడానికి లేదు. ఆ దేశం మరేదో కాదు యూరోపియన్ కంట్రీ డెన్మార్క్.
25
పిల్లల పేర్ల విషయంలో కఠిన నిబంధనలు
పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో డెన్మార్క్ లో చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అసలెందుకు డెన్మార్క్ పిల్లల పేర్ల విషయంలో కఠిన నిబంధనలు తీసుకువచ్చింది ? ఆ రూల్స్ ఏంటి అనేది వివరాల్లో తెలుసుకుందాం. డెన్మార్క్ లో పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల్లోపు వారి పేర్లని రిజిస్టర్ చేయాలి. అలా చేయకపోతే రోజువారీగా తల్లిదండ్రులకు జరిమానా ఉంటుంది. అలాగని ఎలా పడితే అలా పేర్లు పెట్టడానికి లేదు. అబ్బాయిలకు అమ్మాయిలకు వేర్వేరుగా డెన్మార్క్ ప్రభుత్వం 7వేల పేర్ల లిస్ట్ ని రెడీ చేసి ఉంచింది.
35
ఇష్టంవచ్చిన పేర్లు పెట్టడానికి లేదు
ఆ లిస్ట్ నుంచే తల్లి దండ్రులు ఏదో ఒక పేరు ఎంచుకోవాలి. అలా కాకుండా ఆ లిస్ట్ లో లేని, తమకు ఇష్టమైన మరో పేరు పెట్టాలి అని తల్లిదండ్రులు భావిస్తే తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకోవాల్సిందే. స్థానిక చర్చి ఆధ్వర్యంలో నేమ్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఉంటుంది. అక్కడ తల్లి దండ్రులు తమ పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలి అనుకుంటున్నారో అప్లికేషన్ ద్వారా తెలియజేయాలి. ఈ పేర్లని కమిటీ పరిశీలిస్తుంది. ఎలాంటి అభ్యంతరం లేకుంటే అనుమతి లభిస్తుంది. కానీ పిల్లలకు జంతువుల పేర్లు, ఏదైనా బ్రాండ్ పేర్లు వచ్చేలా ఉంటే కమిటీ వెంటనే అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇలా డెన్మార్క్ లో ప్రతి ఏడాది 20 శాతం అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతుంటాయి.
అసలు డెన్మార్క్ దేశం ఎలాంటి చట్టం తీసుకువచ్చింది అంటే.. దీని వెనుక బలమైన కారణం ఉంది. తల్లి దండ్రుల తమ పిల్లలకు జంతువు లేదా బ్రాండ్ పేర్లు పెడితే వాళ్ళు సమాజంలో, స్కూల్స్ లో అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. అది వాళ్ళ మానసిక ఎదుగుదలకి అంత మంచిది కాదు అని ప్రభుత్వం భావించింది. అదే విధంగా అబ్బాయికి అమ్మాయిలా అనిపించే పేర్లు, అమ్మాయిలకు అబ్బాయిలా అనిపించే పేర్లు పెట్టినా ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది.
55
ఒక వేళ డెన్మార్క్ లో ఇండియన్స్ ఉంటే
ఒక వేళ డెన్మార్క్ లో భారతీయులు సెటిల్ అయి అక్కడి పౌరసత్వం పొంది ఉంటే వారు కూడా నిబంధనలు ఫాలో కావాలి. భారతీయులు సాధారణంగా అర్జున్, రామ్, అభయ్ ఇలాంటి పేర్లు పెడుతుంటారు. ఆ పేర్లు డెన్మార్క్ ప్రభుత్వం లిస్ట్ లో లేకుంటే వీళ్ళు కూడా అప్లై చేసుకుని ఆమోదం పొందవచ్చు. ఎంచుకున్న పేర్లకు భారతీయ సంప్రదాయం ప్రకారం మంచి అర్థం ఉందని తెలియజేస్తే చాలు.