మనదేశంలో నీటిపై తేలియాడే ఒకే ఒక్క గ్రామం ఇది.. ఇక్కడ 134 ఇళ్లన్నీ నీళ్లపైనే

Published : Nov 16, 2026, 10:35 AM IST

భారతదేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది. ఇది పూర్తిగా నీటిపై తేలియాడుతుంది. నీటిపై పేరుకుపెయిన గడ్డిలాంటి ప్రదేశాలపై ఇళ్లను వెదురుతో కట్టుకుంటారు. ఆ గ్రామం ఏదో, ఎక్కడుందో తెలుసా?

PREV
13
ఇండియాలో నీటిపై తేలియాడే గ్రామం

భారతదేశంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కొండలపై ఇళ్లు కట్టుకుని జీవిస్తుంటే, మరికొన్ని చోట్ల నదులు, సరస్సుల మధ్య నివసిస్తుంటారు. అయితే ఒక గ్రామంలో మాత్రం ప్రజలు ఏకంగా నీటిపై తేలియాడే ఇళ్లలో జీవిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రత్యేక గ్రామం పేరు చంపు ఖాంగ్‌పోక్ (Champu Khangpok). ఇది ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో ఉంది. అక్కడి ప్రసిద్ధ లోక్‌తక్ సరస్సు మధ్యలో ఈ గ్రామం కనిపిస్తుంది. భారతదేశంలో సహజంగా నీటిపై తేలియాడే ఏకైక గ్రామంగా దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రజలు తరతరాలుగా లోక్ తక్ సరస్సునే నమ్ముకుని జీవిస్తున్నారు.

23
ఎలా తేలియాడుతున్నాయి?

ఈ గ్రామం ప్రత్యేకతకు కారణం ఫుమ్డిస్ (Phumdis). ఇవి నీటిలో తేలియాడే మొక్కలు, గడ్డి, ఇతర వృక్ష పదార్థాలు కలిసి ఏర్పడిన దట్టమైన దిబ్బలు. ఇవి కొన్ని అడుగుల మందంతో ఉంటాయి. వీటిపైనే గ్రామస్థులు వెదురు కర్రలు, చెక్కలు, గడ్డి ఉపయోగించి చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుంటారు. ఈ ఇళ్లను ఖాంగ్‌పోక్ అని పిలుస్తారు. సాధారణ గ్రామాల్లో రోడ్లపై నడిచినట్లు ఇక్కడ నడవడం సాధ్యం కాదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే చిన్న పడవలను ఉపయోగిస్తారు. చేపల వేటే ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనాధారం. సరస్సులో చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా కుటుంబాలను పోషించుకుంటారు. ఈ గ్రామంలో 134 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 400 మంది జీవిస్తున్నారు.

33
ప్రత్యేకమైన సరస్సు

లోక్‌తక్ సరస్సు ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న చిత్తడి నేలగా రామ్‌సర్ గుర్తింపు కూడా పొందింది. ఈ సరస్సులో తేలియాడే దీవులు, వాటిపై నిర్మించిన ఇళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడి ప్రజలు ప్రకృతికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు. అయితే సరస్సులో కాలుష్యం, పర్యావరణ మార్పులు, చేపల లభ్యత తగ్గడం వంటి సమస్యలు గ్రామస్తుల జీవనంపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ ప్రజలు నీటిపైనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే చంపు ఖాంగ్‌పోక్ గ్రామం మన దేశానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories