సాహసాలు, వినోదం కోరుకునే పర్యాటకులకు భవనీ ద్వీపం ఒక స్వర్గమనే చెప్పాలి. స్పీడ్ బోట్లు, జెట్ స్కీ, బనానా రైడ్స్ వంటి వాటర్ స్పోర్ట్స్‌తో పాటు జిప్ లైన్, రోప్ క్లైంబింగ్ లాంటి యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా గడపడమే కాకుండా, పర్యాటకులు నదీ తీరంలో వేడివేడిగా లభించే స్థానిక ఆంధ్ర రుచులు, ముఖ్యంగా ప్రసిద్ధ రొయ్యల వేపుడును ఆస్వాదించవచ్చు. నైట్ స్టే ప్లాన్ చేసుకునే వారి కోసం ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్, ప్రత్యేకమైన ట్రీ హౌస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.